కార్తీక మాస వన సమారాధన మహోత్సవంలో పాల్గొన్న మేయర్ లక్ష్మీ అపర్ణ
గుంటూరు : గుంటూరులో శ్రీ తారకరామా ఎస్వీఎన్ కాలనీ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వన సమారాధన మహోత్సవం, ప్రసాద వితరణ కార్యక్రమానికి గుంటూరు నగర మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్తీక మాస విశిష్టతను స్మరించుకుంటూ, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను, సత్సంబంధాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించిన అసోసియేషన్ సభ్యులను అభినందించి,ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
సూర్య నాయక్