BREAKING
తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రమాణ స్వీకారం జీజీహెచ్‌లో సహజ ప్రసవాలపై అవగాహన ర్యాలీ ఆత్మకూరులో "ఆనం ", "బొమ్మిరెడ్డి "ల మేలుకలయిక మలుపు తిరిగిన రాజకీయం వైభవంగా అయ్యప్ప మహాపడిపూజ నగరం మండలంలో 60 మంది సర్పంచ్, 249 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు ఆత్మకూరులో కొయ్య వృత్తిదారులచే విరాట్ కార్పెంటర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు వైసీపీ కి అధికారం బ్రమే...కూటమిదే అధికారం:మజ్జి వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఆనంగి ప్రచారం పరిటాల శ్రీరామ్‌కు సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధుల అభినందనలు జోరుగా పంచాయతీ ఎన్నికల ప్రచారం ఇరువర్గాలు పోటాపోటీగా ప్రచారం హైదరాబాద్‌లో 26/11 తరహా ఉగ్రదాడుల బెదిరింపు రాత్రులు చలి తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగ మంచు ఇబ్బందుల్లో ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. ఎం. జయసింహాద్రి ఎన్నిక ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోర్ల దంపతులు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు

బెంగళూరు ఎయిర్‌పోర్టు వద్ద హైడ్రామా.. జగన్ ఇంటికి వెళ్లకుండా షర్మిల, విజయమ్మలను అడ్డుకున్న పోలీసులు

Select Suryaa Now
బెంగళూరు ఎయిర్‌పోర్టు వద్ద హైడ్రామా.. జగన్ ఇంటికి వెళ్లకుండా షర్మిల, విజయమ్మలను అడ్డుకున్న పోలీసులు

బెంగళూరు: బెంగళూరు విమానాశ్రయం వద్ద ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల, వై.ఎస్. విజయమ్మలకు ఊహించని పరిణామం ఎదురైంది. మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నివాసమైన యలహంక ఇంటికి వెళ్లేందుకు వీరిద్దరూ ప్రయత్నించగా, పోలీసులు వారిని విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ జగన్ ఇంటికి వెళ్లేందుకు షర్మిల, విజయమ్మ సిద్ధమవగా, కోర్టు ఆదేశాలు ఉన్నందున అక్కడికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే, తాను యలహంక ఇంటికే వెళ్తానంటూ షర్మిల పట్టుబట్టడంతో బెంగళూరు ఎయిర్‌పోర్టు వద్ద ఒక్కసారిగా హైడ్రామా నెలకొంది. ఈ క్రమంలో పోలీసులతో షర్మిల సుమారు 20 నిమిషాల పాటు వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో చేసేదేమీ లేక షర్మిల, విజయమ్మ అక్కడి నుండి వెనక్కి వెళ్లిపోయారు.