ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ...... మెగా రక్తదాన, ఉచిత కంటి వైద్య శిబిరం
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్ : కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం టిడిపి నేతలు ఘనంగా నిర్వహించారు. స్థానిక డిఎల్ఎన్ఆర్ గవర్నమెంట్ హై స్కూల్ ప్రాంగణంలో వాసన్ ఐ కేర్, మెడిపల్స్ బ్లడ్ సెంటర్ వారి సౌజన్యంతో మునిసిపల్ చైర్ పర్సన్ దొడ్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఉచిత కంటి, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ దొడ్ల విజయలక్ష్మి మాట్లాడుతూ సేవా భావం కలిగిన అభివృద్ధి ప్రదాత కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జన్మదిన వేడుకలను తాను చైర్ పర్సన్ అయిన వెంటనే జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కోట్ల రూపాయలు వెచ్చించి నియోజకవర్గాన్ని అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం పట్టణాన్ని అభివృద్ధి చేశారన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని నాయకుల, కార్యకర్తల సహకారంతో మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసి ఎమ్మెల్యే తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు ఎంవి శేషయ్య, నాయకులు దొడ్ల కోదండరామిరెడ్డి, ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, కౌన్సిలర్లు, మహిళా నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.