BREAKING
తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రమాణ స్వీకారం జీజీహెచ్‌లో సహజ ప్రసవాలపై అవగాహన ర్యాలీ ఆత్మకూరులో "ఆనం ", "బొమ్మిరెడ్డి "ల మేలుకలయిక మలుపు తిరిగిన రాజకీయం వైభవంగా అయ్యప్ప మహాపడిపూజ నగరం మండలంలో 60 మంది సర్పంచ్, 249 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు ఆత్మకూరులో కొయ్య వృత్తిదారులచే విరాట్ కార్పెంటర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు వైసీపీ కి అధికారం బ్రమే...కూటమిదే అధికారం:మజ్జి వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఆనంగి ప్రచారం పరిటాల శ్రీరామ్‌కు సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధుల అభినందనలు జోరుగా పంచాయతీ ఎన్నికల ప్రచారం ఇరువర్గాలు పోటాపోటీగా ప్రచారం హైదరాబాద్‌లో 26/11 తరహా ఉగ్రదాడుల బెదిరింపు రాత్రులు చలి తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగ మంచు ఇబ్బందుల్లో ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. ఎం. జయసింహాద్రి ఎన్నిక ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోర్ల దంపతులు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు

గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత

Select Suryaa Now
 గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత

సూర్య, లక్షెట్టిపేట :

• అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తాం

•  గ్రామ పంచాయతీ భవనాలు, వైద్య కేంద్రాల ప్రారంభోత్సవంలో కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు 

గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.

ఆదివారం లక్షెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, సూరారం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున నిధులు వెచ్చించి గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించినట్లు తెలిపారు. జిల్లాలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.5.50 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే 20 భవనాల నిర్మాణం పూర్తికాగా, మరో 100 భవనాలు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. రానున్న మూడు, నాలుగు నెలల్లో 50 శాతం పనులు పూర్తి చేసి, మిగిలిన పనులను వచ్చే ఏడాదిలో పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు.

గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, విద్యుత్ సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తూ లక్షెట్టిపేట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద రేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లో 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల సంపాదించే సభ్యులకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించేందుకు గ్రామాల వారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అర్హులను నమోదు చేస్తామని కలెక్టర్ తెలిపారు.

అదేవిధంగా జిల్లాలో ఇప్పటికే 10,360 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఇంకా అర్హులైన వారు ఎవరైనా మిగిలి ఉంటే నిబంధనల ప్రకారం పెన్షన్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యుత్ స్తంభాలు కిలోమీటరు పరిధిలో అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్లు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ప్రజలు కొత్త మీటర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. సీసీ రోడ్లు, మురుగు కాలువలు, విద్యుత్ సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. అర్హులైన వారికి పెన్షన్లు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీకి సొంత భవనం నిర్మించుకోవడం అభినందనీయమని, సర్పంచ్ సుధాకర్‌ను అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, జిల్లా పంచాయతీ అధికారి కిషన్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.