BREAKING
ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ విధానంలో పారదర్శకంగా ఎరువుల పంపిణీ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలో ప్రతిభ చూపాలి* చెంచులక్ష్మి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. ముత్తుకూరు తెదేపా సర్పంచ్ అభ్యర్థిగా షబ్బీర్ నామినేషన్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: ఎస్పీ విక్రాంత్ పాటిల్ “ఎదగడం ఒక విజయం… ఎదిగిన తర్వాత తనవారిని గుర్తుపెట్టుకోవడం ఒక గొప్ప సంస్కారం... రాజకీయాల్లో ఐదేళ్లకోసారి బ్యాలెన్స్ షీట్.. రెండోసారి అధికారంలోకి రావడం ఖాయం పొదిలి పట్టణంలోని అమ్మవారి శాలలో జరిగిన ఆర్యవైశ్య కార్తీకమాస వనభోజనాలు డాక్టర్ శ్రీ మస్తాన్ భాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నెల్లూరు జిల్లా దూదేకుల అసోసియేషన్ షాబాద్‌ మండలంలోని పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ముగ్గురికి గాయాలు వీపీఆర్ నివాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వీపీఆర్ దంపతులను ఆశీర్వదించిన మత పెద్దలు నూతన కార్పొరేటర్లకు మంత్రి టీజీ భరత్ ఆత్మీయ తేనీటి విందుq డ్రగ్స్ రహిత భారత్ ఉద్యమానికి ప్రభాస్ మద్దతు.. ప్రత్యేకంగా ఆహ్వానించిన కిషన్‌రెడ్డి వేమిరెడ్డి దంపతుల ఆతిథ్యంలో వీపీఆర్ నివాసంలో ప్రముఖులకు విందు మహిళా హత్య కేసును 24 గంటల్లోనే.. ఛేదించిన చేవెళ్ల పోలీసులు, నిందితుడి అరెస్ట్

రాజకీయాల్లో ఐదేళ్లకోసారి బ్యాలెన్స్ షీట్.. రెండోసారి అధికారంలోకి రావడం ఖాయం

Select Suryaa Now
రాజకీయాల్లో ఐదేళ్లకోసారి బ్యాలెన్స్ షీట్.. రెండోసారి అధికారంలోకి రావడం ఖాయం

హైదరాబాద్: రాజకీయాల్లో ఐదేళ్లకు ఒకసారి 'బ్యాలెన్స్ షీట్' వస్తుందని, ఎన్నికల సమయంలో కచ్చితంగా ప్రతి ఒక్కరి పనితీరును కొలుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా రెండోసారి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

గాంధీభవన్‌లో నిర్వహించిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడలను తమకు వదిలేయాలని సూచించిన ఆయన.. పార్టీలో ఎవరేం చేస్తున్నారనే పూర్తి డేటా తమ వద్ద ఉందని వ్యాఖ్యానించారు. నేతలు బయటకు, లోపల.. అంటే ముందేం మాట్లాడుతున్నారు, వెనకేం మాట్లాడుతున్నారనే విషయాలన్నీ తమకు తెలుసంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ బలోపేతంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు.