BREAKING
డ్రగ్స్ రహిత భారత్ ఉద్యమానికి ప్రభాస్ మద్దతు.. ప్రత్యేకంగా ఆహ్వానించిన కిషన్‌రెడ్డి వేమిరెడ్డి దంపతుల ఆతిథ్యంలో వీపీఆర్ నివాసంలో ప్రముఖులకు విందు మహిళా హత్య కేసును 24 గంటల్లోనే.. కేసును ఛేదించిన చేవెళ్ల పోలీసులు, నిందితుడి అరెస్ట్ ఆర్యవైశ్యుల ఐక్యతతోనే అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధ్యం: మంత్రి టీజీ భరత్ బాపట్ల ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే నసీర్ కలయకాగొల్లులో వైసీపీ ఖాళీ.. తెలుగు దేశంలోకి 70 కుటుంబాలు పనులు పూర్తయ్యాక బిల్లుల సంగతేంటి?.. పీఏసీ భేటీలో జగ్గారెడ్డి సూటి ప్రశ్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు ముఖ్య అతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎంపీని కలిసిన కొత్త కార్పొరేటర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఘనంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదిన వేడుకలు గాంధీ భవన్‌లో ముగిసిన పీఏసీ సమావేశం.. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు మర్పల్లిలో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి 200 మంది చేరిక సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం ప్రశాంతమ్మకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

గాంధీ భవన్‌లో ముగిసిన పీఏసీ సమావేశం..

Select Suryaa Now
గాంధీ భవన్‌లో ముగిసిన పీఏసీ సమావేశం..

హైదరాబాద్: గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కేవలం నిర్దేశిత అజెండా అంశాలను మాత్రమే చర్చించాలని, ఇతర విషయాలను ప్రస్తావించవద్దని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ సభ్యులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

సమావేశంలో భాగంగా రాష్ట్రంలో నెలకొననున్న 'ఎల్‌నినో' (El Niño) వాతావరణ పరిస్థితులు, సాగునీటి లభ్యతపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రూ. 13 వేల కోట్ల వ్యయంతో సాగునీటి పనులు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు ప్రధానంగా చెరువుల పూడికతీత, మరమ్మతు పనులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని ఆయన పేర్కొన్నారు.