BREAKING
కొలువుతీరిన తిరుపతి నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం ప్రజావాణిలో ఒకే ఒక్క దరఖాస్తు పదవులను బాధ్యతగా భావించి ప్రజాసేవ చేయాలి: తాళ్ళ వెంకటేష్ యాదవ్ నోయెల్ టాటా లేఖతో కీలక మలుపు... గ్రామ సభల్లో ఎల్ నినో ముప్పుపై అవగాహన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ గోల్డ్ స్పాట్ కమ్‌బ్యాక్ కస్తూర్బా విద్యార్థినులకు పోలీసుల అవగాహన ఐదవ వార్డులో వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ అభ్యర్థి దండా వెంకట వంశీకృష్ణ విస్తృత ప్రచారం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య గ్రామం లోని పలు వార్డులలో సాయిబాబా ఎన్నికల ప్రచారం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.. 27న ఒంగోలులో జన విజ్ఞాన వేదిక రాష్ట్రస్థాయి వక్త పోటీలు దీపాల కాంతుల్లో వెలిగిన భక్త మార్కండేశ్వర స్వామి ఆలయం !! నర్సాపూర్‌లో రూ.87 లక్షల చెక్కుల పంపిణీ…కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డ ప్రతి అర్హత కుటుంబానికి జీవిత బీమా పథకం

కలయకాగొల్లులో వైసీపీ ఖాళీ.. తెలుగు దేశంలోకి 70 కుటుంబాలు

Select Suryaa Now
కలయకాగొల్లులో వైసీపీ ఖాళీ.. తెలుగు దేశంలోకి 70 కుటుంబాలు

నెల్లూరు,  మేజర్ న్యూస్ :  బుచ్చిరెడ్డిపాళెం మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కలయకాగొల్లు పంచాయతీకి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు పుత్తేటి శివకుమార్ రెడ్డి, పుత్తేటి మహేష్ రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరితో పాటు 70 కుటుంబాలు కూడా టీడీపీలో చేరాయి. నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో ఆదివారం ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి   జన్మదినోత్సవం రోజునే ఈ చేరికలు జరగడం విశేషం. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కోవూరు శాసనసభ్యులు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  వారికి పసుపు కండువాలు కప్పి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల స్ఫూర్తితో, పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి మరోసారి ఘన విజయం సాధించేలా పనిచేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని, పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి   భరోసా ఇచ్చారు.