BREAKING
వీపీఆర్ నివాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వీపీఆర్ దంపతులను ఆశీర్వదించిన మత పెద్దలు నూతన కార్పొరేటర్లకు మంత్రి టీజీ భరత్ ఆత్మీయ తేనీటి విందుq డ్రగ్స్ రహిత భారత్ ఉద్యమానికి ప్రభాస్ మద్దతు.. ప్రత్యేకంగా ఆహ్వానించిన కిషన్‌రెడ్డి వేమిరెడ్డి దంపతుల ఆతిథ్యంలో వీపీఆర్ నివాసంలో ప్రముఖులకు విందు మహిళా హత్య కేసును 24 గంటల్లోనే.. కేసును ఛేదించిన చేవెళ్ల పోలీసులు, నిందితుడి అరెస్ట్ ఆర్యవైశ్యుల ఐక్యతతోనే అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధ్యం: మంత్రి టీజీ భరత్ బాపట్ల ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే నసీర్ కలయకాగొల్లులో వైసీపీ ఖాళీ.. తెలుగు దేశంలోకి 70 కుటుంబాలు పనులు పూర్తయ్యాక బిల్లుల సంగతేంటి?.. పీఏసీ భేటీలో జగ్గారెడ్డి సూటి ప్రశ్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు ముఖ్య అతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎంపీని కలిసిన కొత్త కార్పొరేటర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఘనంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదిన వేడుకలు గాంధీ భవన్‌లో ముగిసిన పీఏసీ సమావేశం.. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు మర్పల్లిలో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి 200 మంది చేరిక

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు ముఖ్య అతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు ముఖ్య అతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

మర్పల్లి, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బూచన్‌పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామానికి చెందిన కుంటెల్లి గోపాల్–పెంటమ్మ దంపతులు, లసుంపురం భాగ్యమ్మ–జనార్ధన్ రెడ్డి దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన గృహాల్లోకి అడుగుపెట్టిన దంపతులకు తన సొంత ఖర్చులతో నూతన వస్త్రాలను అందజేసి ఆప్యాయంగా సత్కరించారు. నూతన గృహాల్లో దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం పేదల సొంత ఇంటి కలను సాకారం చేస్తోందని, ఇందిరమ్మ ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా కృషి చేస్తామని, అర్హులైన వారు ఎవరూ మిగిలిపోకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆత్మీయంగా మాట్లాడిన ఆయన గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.