BREAKING
గాంధీ భవన్‌లో ముగిసిన పీఏసీ సమావేశం.. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు మర్పల్లిలో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి 200 మంది చేరిక సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం ప్రశాంతమ్మకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు *పత్రికా ప్రకటన* *తేదీ: 22.11.2026* *ప్రశాంతి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సర్వమత ప్రార్థనలు* *- నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వీపీఆర్ దంపతులను ఆశీర్వదించిన మత పెద్దలు* కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం వ్యాధుల నివారణ, ప్రెసిషన్ మెడిసిన్ వైపు భారత్ వైద్య పరిశోధనల అడుగులు 250 మందికి ఉచిత వైద్య సేవలు చిన్నారుల మధ్య ఘనంగా ప్రశాంతమ్మ జన్మదిన వేడుకలు చారిత్రక చంగిస్ ఖాన్ పేట 5వ వార్డు సభ్యురాలిగా ఇనాదుల శిరీష ఏకగ్రీవం దేవంపల్లి గ్రామ పాలచెరువుకు జలకళ.. ముందస్తు చర్యలతో రైతులకు భరోసా! అధిష్ఠానం ఆదేశాలను నూరు శాతం పాటిస్తా పంచాయతీల్లో పోటీ వద్దు...ఏకగ్రీవాలకే మొగ్గు బలహీనపడిన అక్వాన్ తుపాను కురువ శశికళ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను శుభాకాంక్షలు తెలిపిన బుట్టా రేణుక,బుట్టా శివ నీలకంఠ దంపతులు

చారిత్రక చంగిస్ ఖాన్ పేట 5వ వార్డు సభ్యురాలిగా ఇనాదుల శిరీష ఏకగ్రీవం

Select Suryaa Now
చారిత్రక చంగిస్ ఖాన్ పేట 5వ వార్డు సభ్యురాలిగా ఇనాదుల శిరీష ఏకగ్రీవం

 గుంటూరు : చారిత్రాత్మక కొండవీడు కోటకు అతి సమీపాన ఉండి, నేడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతున్న చంగిస్ ఖాన్ పేట గ్రామ పంచాయతీలో జనసేన పార్టీ తన సత్తా చాటింది. యడ్లపాడు మండల పరిధిలోని చంగిస్ ఖాన్ పేట 5వ వార్డుకు జరిగిన ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఇనాదుల రామకోటేశ్వరరావు సతీమణి ఇనాదుల శిరీష ఒక్కరే నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ వార్డు స్థానానికి ఇనాదుల శిరీష మాత్రమే సింగిల్ నామినేషన్ దాఖలు కావడంతో, ఎన్నికల అధికారులు ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు.చారిత్రక నేపథ్యం ఉన్న చంగిస్ ఖాన్ పేట గ్రామంలో 5వ వార్డు నుంచి జనసేన అభ్యర్థి ఏకగ్రీవంగా గెలుపొందడంపై స్థానిక జనసేన శ్రేణులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు శిరీష, రామకోటేశ్వరరావు దంపతులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యురాలు ఇనాదుల శిరీష మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న 5వ వార్డు ప్రజలకు, సహకరించిన జనసేన నాయకులకు, గ్రామస్తులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న చంగిస్ ఖాన్ పేటలో 5వ వార్డును అన్ని విధాలా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. అదే విధంగా 9 వ వార్డు నుండి ఎస్ పి. వెంకటేశ్వర్లు 11 వ వార్డు నుండి కటకంశెట్టి సుబ్బులు కూడా జనసేన పార్టీ నుండి ఏకగ్రీవంగా గెలుపొందారు.

 

సూర్య నాయక్