కురువ శశికళ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను శుభాకాంక్షలు తెలిపిన బుట్టా రేణుక,బుట్టా శివ నీలకంఠ దంపతులు
కురువ శశికళ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను శుభాకాంక్షలు తెలిపిన బుట్టా రేణుక,బుట్టా శివ నీలకంఠ దంపతులు
హొళగుంద,సూర్య ప్రతినిధి:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురువ శశికళ కృష్ణమోహన్ కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక ,బుట్టా ఫౌండేషన్ అధినేత శ్రీ బుట్టా శివ నీలకంఠ కర్ణాటక మాజీ మంత్రి బి. శ్రీరాములు,వైయస్ భాస్కర్ రెడ్డిలు,కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆప్యాయంగా ఆశీర్వదించి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా.