చిన్నారుల మధ్య ఘనంగా ప్రశాంతమ్మ జన్మదిన వేడుకలు
నెల్లూరు, మేజర్ న్యూస్ : చిన్నారుల మధ్య ఘనంగా ప్రశాంతమ్మ జన్మదిన వేడుకలు. కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో ఘనంగా జరిగాయి. ఉదయం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, ఎమ్మెల్యే కి గులాబీ పూలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారుల ఆత్మీయ శుభాకాంక్షల మధ్య ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వారితో కలిసి కేక్ కట్ చేసి, ప్రతి ఒక్కరికీ స్వయంగా పంచిపెట్టారు. చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ, వారి చదువు గురించి అడిగి తెలుసుకున్నారు.