పంచాయతీల్లో పోటీ వద్దు...ఏకగ్రీవాలకే మొగ్గు
నెల్లూరు, మేజర్ న్యూస్ : రాజకీయాలకు అతీతంగా ఏకాభిప్రాయంతో సర్పంచ్ లను ఎన్నుకోవాలి. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం తరఫున రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు. వైసీపీ జిల్లా అధ్యక్షుడి మాటలు వింటే మిగిలేది కక్షలు, అప్పులే. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలతో గెలిచామని వైసీపీ నేతలు గగ్గోలు పెట్టారు..ఇప్పుడు బ్యాలెట్లతో జరిగిన ఎన్నికల్లో ఫలితాలను ఏమంటారో. పారదర్శకంగా ఎన్నికలు జరగబట్టే కడప, పులివెందుల ప్రాంతంలోనూ ప్రజాస్వామ్యం గెలిచింది. పులివెందుల నుంచి శ్రీకాకుళం వరకు వైసీపీ తుడిచిపెట్టుకుపోయి కూటమి క్లీన్ స్వీప్ చేసింది. నెల్లూరులో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ 94 శాతం స్టైక్ రేట్ తో 175కి 164 సీట్లను గెలుచుకున్నాయి అప్పుడు వైసీపీ నేతలు ఈవీఎంలు, ఈవీఎంలు అని గొంతు చించుకున్నారు ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది పులివెందుల నుంచి శ్రీకాకుళం వరకు టీడీపీ, జనసేన, బీజేపీ క్లీన్ స్వీప్ చేసేశాయి ఈవీఎంలపైన ఏడ్చినోళ్లు...ఇప్పుడు బ్యాలెట్లను ఏమంటారో..కొత్తగా ఏ పద్ధతి తెమ్మంటారో వైసీపీ నేతలకు అర్థం కాని పరిస్థితి 40 ఏళ్ల తర్వాత కడప, పులివెందుల ప్రాంతంలో అత్యంత పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ జరిగింది మొన్నటి ఎన్నికల వరకు అక్కడ అంతా దుర్మార్గాలే..నామినేషన్లను వేయనిచ్చేది లేదు...ప్రజలకు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించే అవకాశమే లేదు ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితమైనవి..గ్రామాల్లో అందరూ కూర్చుని రాజకీయాలకు అతీతంగా సర్పంచ్ లను ఎన్నుకుంటే కచ్చితంగా ప్రోత్సహించాలి పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది 5 వేలు లోపు జనాభా ఉంటే రూ.15 లక్షలు, 10 వేలు లోపు జనాభా ఉంటే రూ.25 లక్షలు, 10 వేలు పైన జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షలు అందించనున్నారు ఉదాహరణకు సర్వేపల్లిలో 117 పంచాయతీలున్నాయి...ఒక 15 పంచాయతీల్లో పోటీ తప్పదనుకుందాం కనీసం 100 పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే సుమారు రూ.20 కోట్లు ప్రోత్సాహకంగా వచ్చే అవకాశం ఉంది వైసీపీ జిల్లా అధ్యక్షుడేమో ప్రతి పంచాయతీలో పోటీ ఉండాల్సిందే..పోటీ పడాల్సిందే..తన్నుకోవాల్సిందే..లక్షలు ఖర్చుపెట్టాల్సిందే...అప్పులు పాలుకావల్సిందేనని నాయకులకు హుకుం జారీ చేస్తున్నాడు ఏకగ్రీవం కావడం తనకు ఇష్టం లేదని చెబుతున్నాడట..ప్రోత్సాహకంగా వచ్చే రూ.15 లక్షలు, రూ.25 లక్షలు, రూ.50 లక్షలు పంచాయతీలకు వద్దంట ఇలాంటి రాజకీయాలు మేం చేయలేదు..చేయం కూడా...గత పంచాయతీ ఎన్నికల్లోనూ పోటీల విషయంలో బలవంతం చేయలేదు పార్టీ గుర్తులతో జరిగిన ఎన్నికల్లోనే పులివెందులలో సైతం వైసీపీ చేతులెత్తేసింది..ఇప్పుడు పార్టీ గుర్తులు లేకుండా జరిగే ఎన్నికల్లో మాత్రం రెచ్చగొడుతున్నారు ఏకగ్రీవాల విషయంలో అన్ని పార్టీల నాయకులు సానుకూలంగా ఆలోచించాలని కోరుతున్నాను పంతాలకు పోయి పోటీలు పెట్టి, లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకోవడంతో పాటు కక్షలు పెంచుకుంటే ఫలితం లేదు దయచేసి అందరూ రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి గురించి ఆలోచించి ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి పంచాయతీలు ఏకగ్రీవం అయితే ప్రశాంత వాతావరణంలో పల్లెలను అభివృద్ధి చేసుకనే అవకాశం ఉంది సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పంచాయతీలతో పాటు ఎంపీపీలు, జెడ్పీలకు ఒక్క రూపాయి డైవర్ట్ కాకుండా నిధులు వస్తాయి అందరూ సానుకూల దృక్ఫథంతో ఆలోచించి ఏకగ్రీవాల దిశగా ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నాను