BREAKING
పోరంకి–కానూరుకు రూ.34.92 కోట్ల అభివృద్ధి పనులు.. తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు...జనతా పరివార్ పార్టీ అభ్యర్థుల ప్రకటన అభివృద్ధిని చూసి వైసీపీకి కడుపుమంట.. అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌.. రూ.5 లక్షల సొత్తు, రెండు కార్లు స్వాధీనం ఇంట్లో ఇనుపరాడ్‌తో భార్యపై దాడి మేయర్‌గా బొండా సిద్ధార్థకు అవకాశం కల్పించాలి వైభవంగా విజయవాడ ఉత్సవ్–2.. జాతీయస్థాయి కుంగ్ ఫూ కరాటే పోటీల్లో శ్రీ సత్య విద్యానికేతన్ విద్యార్థుల ప్రతిభ. గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి పల్లె పండుగ 3.0తో పల్లెలకు మహర్దశ - పి.గన్నవరంలో రూ.4.30 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గిడ్డి శంకుస్థాపన పత్తి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి? తండ్రి అడుగుజాడల్లో తనయుడు.. జక్కంపూడి రాజా సేవా స్ఫూర్తి గరివిడి లక్ష్మి ట్రైలర్ విడుదల, జానపద బయోపిక్‌లో అదరగొట్టిన ఆనంది, ఆకట్టుకుంటున్న విజువల్స్ నర్సరీ మట్టి లారీలకు టోల్ మినహాయింపు ఇవ్వాలి.. ఎంపీ పురందేశ్వరికి నర్సరీ రైతుల వినతి

డీజీపీ నీ కలిసిన ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి

Select Suryaa Now
డీజీపీ నీ కలిసిన ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి

 

ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు రామంతాపూర్‌లో ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు.

ఈ మేరకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సోమవారం డీజీపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ CV ఆనంద్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని శాంతిభద్రతలు, పోలీస్ వ్యవస్థకు సంబంధించిన పలు అంశాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.

సుమారు 3 లక్షల మందికి పైగా జనాభా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పోలీస్ వ్యవస్థపై అదనపు భారం పడుతోందని ఎమ్మెల్యే వివరించారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా రామంతాపూర్‌కు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు, తగిన సంఖ్యలో పోలీస్ అధికారులు, సిబ్బందిని కేటాయించాలని కోరారు.

అలాగే, ప్రత్యేక పోలీస్ స్టేషన్‌కు శాశ్వత భవనం ఏర్పాటు అయ్యే వరకు ప్రస్తుతం ఉన్న రామంతాపూర్ వార్డు కార్యాలయంలో తాత్కాలికంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

దీనివల్ల రామంతాపూర్ పరిధిలోని ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ అవుతాయని, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఇదే సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధి నుంచి పోలీస్ స్టేషన్‌ను విభజించి ఉప్పల్ పరిధికి తీసుకురావడంలో సహకరించినందుకు డీజీపీకి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఉప్పల్ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం, పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.

ఉప్పల్ నియోజకవర్గంలో జనాభా పెరుగుదల, కొత్త కాలనీల విస్తరణ, పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రామంతాపూర్‌కు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు, అవసరమైన పోలీస్ సిబ్బంది కేటాయింపు అంశాలపై సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు.

ఈ సందర్భంగా డీజీపీ కూడా ఎమ్మెల్యే ప్రస్తావించిన అంశాలను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకునే దిశగా సంబంధిత అధికారులతో చర్చిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో BRS పార్టీ రాష్ట్ర నాయకులు గంధం నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు .