వగ్గంపల్లి అభివృద్ధికి ఉంగరం గుర్తుపై ఓటేయండి
- అఖండ మెజారిటీతో గెలిపించండి.. గ్రామ సేవకు అవకాశం కల్పించండి
పామూరు, మేజర్ న్యూస్ :
వగ్గంపల్లి గ్రామ ప్రజల ఆశీస్సులే తనకు కొండంత బలమని వారి ఆదరణతో సర్పంచ్‌గా గెలిచి గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కుమ్మిత భాగ్యలక్ష్మి అన్నారు. బైరెడ్డి బాలిరెడ్డి కోడలిగా మీ ముందుకు వస్తున్న తనను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. ఈ నెల 26న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని ప్రతి సమస్య పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని వగ్గంపల్లి అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలిపారు. తనను గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కుమ్మిత భాగ్యలక్ష్మి కోరారు.