కార్తీక పౌర్ణమి పూజల్లో మల్లిపెద్ది సుధీర్ రెడ్డి దంపతులు
ఘట్‌కేసర్ రూరల్, మేజర్ న్యూస్: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలోని ప్రతాపసింగారం శ్రీ భవాని చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, చంద్రకళ దంపతులు ఆలయానికి విచ్చేసి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి భక్తితో దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనదని మల్లిపెద్ది సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పవిత్ర రోజున స్వామివారిని దర్శించుకోవడం మనసుకు ప్రశాంతత, ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుందని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తి, ఆధ్యాత్మికత మనిషిలో సత్ప్రవర్తనను పెంపొందించి సమాజంలో శాంతి, ఐక్యతకు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పోచారం డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బద్దం కుమార్, స్థానిక నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని భక్తి పారవశ్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.