సర్పంచ్ టీడీపీ అభ్యర్థుల గెలుపుతో గ్రామాల అభివృద్ధి కి పునాది ఎంపీపీ దేవినేని రమ కోటేశ్వరరావు
టిడిపి సర్పంచ్ అభ్యర్థులు గెలుపుతో గ్రామాల అభివృద్ధికి పునాది. ఎంపీపీ దేవినేని రమ కోటేశ్వరరావు.
సూర్య న్యూస్ ముండ్లమూరు. మండలంలోని గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన టిడిపి మద్దతుదారులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఎంపీపీ దేవినేని రమ కోటేశ్వరరావు కోరారు. టిడిపి సర్పంచ్ అభ్యర్థులు గెలిపిస్తే గ్రామాల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని అన్నారు. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సహకారంతో ఇప్పటికే పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. గడపగడపకు సంక్షేమాన్ని అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. 29 నా జరగబోవు గ్రామపంచాయతీ ఎన్నికలలో టిడిపి సర్పంచ్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఎంపీపీ దేవినేని రమ కోటేశ్వరరావు కోరారు.