BREAKING
‎అమ్మా చదువులమ్మా వందనం ‎‎..ఆథ్యాత్మికం రియాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ టవర్‌పై దాడిని ఖండించిన భారత్ ఢిల్లీలో ఈ సీజన్ అత్యల్ప ఉష్ణోగ్రత 52 వారాల కనిష్ఠానికి టాటా స్టీల్ షేర్లు.. అపోలో డీల్ దీర్ఘకాలంలో సానుకూలమేనా? టికెట్ దక్కలేదని కుంగిపోలేదు.. -భార్యను బరిలో దించి సత్తా చాటిన తలారి బాల -ఇండిపెండెంట్ గా అఖండ విజయం. సర్పంచ్ టీడీపీ అభ్యర్థుల గెలుపుతో గ్రామాల అభివృద్ధి కి పునాది ఎంపీపీ దేవినేని రమ కోటేశ్వరరావు శబరిమలలో అపరిశుభ్ర దుకాణాలకు రూ. లక్ష జరిమానా ఇఫీ 2026లో గుజరాతీ చిత్రం ‘లాలలో కృష్ణ సదా సహాయతే’ సందడి జాతీయ పాల దినోత్సవం 2026 వేడుకలకు పాట్నా వేదిక నక్సలిజం నిర్మూలనలో కీలక మైలురాయి అమెరికా, చైనాలకు దీటుగా యూరోపియన్ యూనియన్ వ్యూహం ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు రష్యాతో వాణిజ్య ఒప్పందాల ప్రతిపాదనలు పక్కనబెట్టిన అమెరికా చైనా ఈవీల పోటీని ఎదుర్కొనేందుకు దక్షిణ కొరియా కసరత్తు సిటీ గ్రూప్ బ్రిటన్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ రాజీనామా సూర్య’కథనానికి స్పందన...!

టికెట్ దక్కలేదని కుంగిపోలేదు.. -భార్యను బరిలో దించి సత్తా చాటిన తలారి బాల -ఇండిపెండెంట్ గా అఖండ విజయం.

Select Suryaa Now
టికెట్ దక్కలేదని కుంగిపోలేదు.. -భార్యను బరిలో దించి సత్తా చాటిన తలారి బాల -ఇండిపెండెంట్ గా అఖండ విజయం.

తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్ 

టికెట్ దక్కలేదని కుంగిపోలేదు.. -భార్యను బరిలో దించి సత్తా చాటిన తలారి బాల -ఇండిపెండెంట్ గా అఖండ విజయం
తిరుపతి రెవిన్యూ,మేజర్ న్యూస్
ఈనెల 1వ తేదీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జరిగిన తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో 27వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన తలారి రేవతి  కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ టికెట్ దక్కకపోయినా ప్రజల ఆశీర్వాదంతో గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు.
తలారి రేవతి భర్త తలారి బాల తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేశారు. ఈసారి టికెట్ ఆశించినా,27వ వార్డు టికెట్ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. అయినా నిరాశ చెందకుండా, ప్రజలపై నమ్మకంతో తన భార్య తలారి రేవతిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దించారు.ఆ నమ్మకాన్ని వార్డు ప్రజలు నిలబెట్టుకుని అఖండ విజయాన్ని అందించారు. వివరాలకు వెళితే..
27వ వార్డులో చిన్న షామియానా అంగడి నడుపుతూ,ఆ వార్డు ప్రజలకు ఏ శుభకార్యమైనా, అశుభకార్యమైనా అవసరానికి తానున్నానంటూ నిరుపేదలకు షామియానా, కుర్చీలు,టేబుళ్లు ఉచితంగా ఇవ్వడమే కాకుండా,ఇంకా ఏదైనా ఆర్థిక అవసరం వచ్చినా తన వంతు సహాయం చేస్తూ ఎలాంటి డబ్బు ఆశించకుండా వారికి చేదోడువాదోడుగా నిలిచారు తలారి బాల. తలారి రేవతి విజయం వెనుక ఆమె భర్త చేసిన మంచి పనులే కారణమని వార్డు ప్రజలు చెబుతున్నారు.
ప్రమాణ స్వీకారం అనంతరం కార్పొరేటర్ తలారి రేవతి మాట్లాడుతూ... ప్రజలకు మరింత సేవ చేయడానికి మంచి అవకాశం కల్పించిన 27వ డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, వారికి కావలసిన సదుపాయాలు, అవసరాలు, సౌకర్యాలు కల్పించి, ప్రభుత్వం ద్వారా పథకాలు లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి