ఉంగరం గుర్తుకు ఓటేయండి.. ఊరి అభివృద్ధికి బాటలు వేయండి ఎల్లసిరి సర్పంచ్ అభ్యర్థి పోచారెడ్డి సుకుమార్ రెడ్డి విజ్ఞప్తి
చిట్టమూరు మేజర్ న్యూస్
ఎల్లసిరి పంచాయతీ అభివృద్ధే లక్ష్యంగా తనను ఆశీర్వదించి ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి పోచారెడ్డి సుకుమార్ రెడ్డి ఓటర్లను విజ్ఞప్తి చేశారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం తనకు ఉంగరం గుర్తు కేటాయించడంతో ఆయన ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మేజర్ న్యూస్ తో బుధవారం మాట్లాడుతూ..ఎల్లసిరి పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.అవినీతికి తావులేని పారదర్శక పాలన అందిస్తూ, అభివృద్ధి,సంక్షేమమే ధ్యేయంగా అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. పేదలు,సామాన్యుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తానని పేర్కొన్నారు.పంచాయతీ పరిధిలోని ఎనిమిది వార్డులకు సంబంధించి తన మద్దతుదారులు పోటీ చేస్తున్న గుర్తులను కూడా ఆయన వెల్లడించారు.ఒకటి,రెండు, నాలుగు వార్డుల్లో కుక్కర్ గుర్తు,మూడు, ఐదు,ఆరు, ఏడు,ఎనిమిది వార్డుల్లో గౌను గుర్తులు కేటాయించినట్లు తెలిపారు.ఆయా వార్డుల ఓటర్లు కుక్కర్,గౌను గుర్తులపై ఓటు వేసి తన మద్దతుదారులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న సుకుమార్ రెడ్డి.. ప్రజల ఆదరాభిమానాలతో పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.తనను ఆశీర్వదించి ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, అలాగే ఆయా వార్డుల్లో పోటీ చేస్తున్న తన మద్దతుదారులకు కుక్కర్, గౌను గుర్తులపై ఓటు వేసి మద్దతు తెలపాలని ఓటర్లను కోరారు.
అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్