BREAKING
స్వీడన్‌లో రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరపడేనా?: అమెరికా కార్ల తయారీ సంస్థలకు భారీ ఊరట కార్తీకదీపాల కాంతులలో శైవ క్షేత్రాలు తిరుపతిలో తొలి విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం ముస్లింలు, పండిట్ల సమిష్టి కృషి.. 37 ఏళ్ల తర్వాత తెరుచుకున్న 700 ఏళ్ల నాటి ఆలయం తప్పిపోయిన బాలిక ఆచూకీ లభించింది.. కీసర పోలీసుల గాలింపుతో క్షేమంగా ఇంటికి! రెండు గంటల పాటు గాలింపు.. కీసరవాణి పార్కింగ్ వద్ద గుర్తింపు తిరువూరుకు ఎమ్మెల్యే కొలికపూడి దూరం.. రెండు నెలలుగా నియోజకవర్గానికి దూరంగా నేటి రాశి ఫలాలు25 నవంబర్, 2026 నేటి పంచాంగం25 నవంబర్, 2026 తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్

కార్తీకదీపాల కాంతులలో శైవ క్షేత్రాలు

Select Suryaa Now
కార్తీకదీపాల కాంతులలో శైవ క్షేత్రాలు

శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

జ్వాలా తోరణం లో స్వామి వారి ప్రవేశం

శంకర సన్నిధిలో  కార్తీక పౌర్ణమి శోభ.

పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్....
( కిరణ్ కుమార్ ఆరిక )

కార్తీకదీపాల కాంతులతో శైవ క్షేత్రాలు వెలుగులు ప్రకాశించాయి. కార్తిక మాసం, కార్తీక పౌర్ణమి సందర్భంగా పెనుబల్లి మండలంలోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణలతో మారుమోగాయి. వేద పండితుల వేదమంత్రాలతో  నీలాద్రిశ్వర, శ్రీ దుర్గా ఆలయాలలో జ్వాలా తోరణం వెలిగించి శివ పార్వతులు జ్వాలాతోరణ ప్రవేశం కావించారు. అగ్ని రూప శివపార్వతులు దర్శనం భక్తులకు కనువిందు చేసింది. మండలంలోని నీలాద్రిలోని నీలాద్రిశ్వర ఆలయం, విఎం బంజర గ్రామం ఎన్ఎస్పి కాలువ వద్ద ఉన్న శ్రీ దుర్గా మల్లికార్జున ఆలయం, పెనుబల్లి వైస్ జంక్షన్ వద్ద గల శ్రీ లక్ష్మీ నాగ మల్లేశ్వరి ఆలయం తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తి అభిషేకాలు నిర్వహించి వెలిగించి శంకరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెనుబల్లి మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం నీలాద్రీశ్వర సన్నిధికి తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తారు. నీలాద్రిశ్వర ఆలయ కమిటీ చైర్మన్ చీకటి చిన్న నరసింహారావు పర్యవేక్షణలో  ఆలయ అధికారి మధుపాయ్ చౌదరి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. అయ్యప్ప స్వాములు భారీ ఎత్తున పాదయాత్రతో నీలాద్రిశ్వర సన్నిధికి చేరుకున్నారు. భక్తులు  కోనేటిలో స్నానాలు ఆచరించి నీలాద్రిశ్వరుడుని దర్శించుకున్నారు. అయ్యప్ప స్వామి భజనలు, భక్తుల ఓంకార నాదాలు నీలాద్రి కొండల్లో ప్రతిధ్వనించాయి. భక్తులు పంచామృత, కుంకుమ,క్షిర గంధాలతో స్వామివారికి అభిషేకాలు చేశారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో ఆలయ ప్రాంగణానికి ఆలయానికి చేరుకుని దైవదర్శన అనంతరం కార్తీక దీపాలను వెలిగించి కోనేరులోని గంగాదేవికి సమర్పించారు.