BREAKING
స్వీడన్‌లో రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరపడేనా?: అమెరికా కార్ల తయారీ సంస్థలకు భారీ ఊరట కార్తీకదీపాల కాంతులలో శైవ క్షేత్రాలు తిరుపతిలో తొలి విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం ముస్లింలు, పండిట్ల సమిష్టి కృషి.. 37 ఏళ్ల తర్వాత తెరుచుకున్న 700 ఏళ్ల నాటి ఆలయం తప్పిపోయిన బాలిక ఆచూకీ లభించింది.. కీసర పోలీసుల గాలింపుతో క్షేమంగా ఇంటికి! రెండు గంటల పాటు గాలింపు.. కీసరవాణి పార్కింగ్ వద్ద గుర్తింపు తిరువూరుకు ఎమ్మెల్యే కొలికపూడి దూరం.. రెండు నెలలుగా నియోజకవర్గానికి దూరంగా నేటి రాశి ఫలాలు25 నవంబర్, 2026 నేటి పంచాంగం25 నవంబర్, 2026 తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్

తిరుపతిలో తొలి విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం

Select Suryaa Now
తిరుపతిలో తొలి విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం

తిరుపతి: జిల్లాలో రేపు జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.

తొలి విడతలో మొత్తం 404 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా, వీటిలో 136 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 268 సర్పంచ్ స్థానాలకు 853 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే, 1,545 వార్డు స్థానాలకు గాను 3,333 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.

జిల్లాలోని పుల్లంపేట మండలం వాతలూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి అత్యధికంగా 12 మంది అభ్యర్థులు పోటీ పడుతుండటంతో అక్కడ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ఓటర్లు తమ ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా అధికారులు ఇప్పటివరకు 1.82 లక్షల ఓటరు స్లిప్పుల పంపిణీని పూర్తి చేశారు.