సూర్య’కథనానికి స్పందన...!
*--శుభ్రం చేసిన వాటర్ ట్యాంక్*
నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని రేకుల చౌడాపూర్ గ్రామంలో తాగునీటి ట్యాంకులో మట్టి పేరుకుపోయి అపరిశుభ్రంగా మారిన విషయంపై ‘నేటి దినపత్రిక సూర్య’లో బుధవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.వెంటనే స్పందించిన సంబంధిత సిబ్బంది వాటర్ ట్యాంకును పూర్తిస్థాయిలో శుభ్రం చేయించారు.గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తే పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.ప్రజా సమస్యలపై‘నేటి దినపత్రిక సూర్య’వార్త కు అధికారుల స్పందనకు నిదర్శనం!