BREAKING
11 లక్షల ప్రమిదలతో కాశీ దేవ దీపావళి వైభవం ఢిల్లీలో దారుణం.. కేఫ్‌లో పార్టీ ముగిశాక 22 ఏళ్ల యువతిపై గ్యాంగ్‌రేప్! జాతీయ రహదారి పక్కన పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు ప్రమాదంలో తప్పిన పెను ముప్పు.. ప్రయాణికులు క్షేమం బంజారాహిల్స్ సమీపంలో హెచ్‌ఎండీఏ ప్రీమియం ప్లాట్ల ఈ-వేలం.. నేడే బిడ్డింగ్! పసిడి ప్రియులకు భారీ ఊరట.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు! కార్తీక పౌర్ణమి రథోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌కు రూ. 88,624.65 కోట్ల పెట్టుబడుల వెల్లువ: షాంఘై నాయకుల బీజింగ్‌కు విధేయత ప్రకటన: చైనా అంతరిక్ష కేంద్రంలోకి తొలి పాకిస్థాన్ వ్యోమగామి: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల తగ్గుదల: వెనిజులా మార్కెట్లోకి మళ్లీ అడుగుపెట్టేందుకు సిటీ గ్రూప్ కసరత్తు: ఆస్ట్రేలియా సైనిక వివక్షపై చారిత్రక క్షమాపణ: ఉక్రెయిన్ ఓడరేవు నగరం ఒడెసాపై రష్యా భీకర దాడి.. ఆస్ట్రేలియా డాలర్ బలోపేతం: ఆసియా స్టాక్ మార్కెట్లలో మళ్లీ భారీ పతనం:

పసిడి ప్రియులకు భారీ ఊరట.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు!

Select Suryaa Now
పసిడి ప్రియులకు భారీ ఊరట.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు!

హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. గత కొన్ని రోజులుగా ఆకాశాన్నంటుతున్న పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడటంతో కొనుగోలుదారులకు పెద్ద ఊరట లభించింది.

తాజా ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములపై ఏకంగా రూ.3,220 మేర తగ్గి రూ.1,24,580 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.2,950 తగ్గుదలను నమోదు చేసి రూ.1,14,200కు చేరుకుంది.

మరోవైపు బంగారం బాటలోనే వెండి ధర కూడా భారీగా దిగొచ్చింది. కిలో వెండిపై ఏకంగా రూ.10,000 తగ్గడంతో ప్రస్తుతం రూ.1.65 లక్షల వద్ద ట్రేడవుతోంది. ధరలు గణనీయంగా తగ్గడంతో ఆభరణాల దుకాణాల వద్ద కొనుగోలుదారుల సందడి పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.