ఢిల్లీలో దారుణం.. కేఫ్‌లో పార్టీ ముగిశాక 22 ఏళ్ల యువతిపై గ్యాంగ్‌రేప్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్ ప్రాంతంలో ఉన్న సల్తనత్ కేఫ్‌లో 22 ఏళ్ల యువతిపై సహోద్యోగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకే కేఫ్‌లో ఉద్యోగులుగా పనిచేస్తున్న బాధితురాలు, నిందితులు సోమవారం రాత్రి కేఫ్‌లో పార్టీ చేసుకున్నారు. సాధారణ పనివేళలు ముగిశాక రాత్రి 11.30 గంటల తర్వాత కూడా కేఫ్ తలుపులు వేసి కొనసాగించిన ఈ పార్టీ మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ముగిసింది. పార్టీ అనంతరం సహోద్యోగుల్లోని ఇద్దరు యువకులు తనపై అత్యాచారానికి పాల్పడగా, మిగిలిన వారు వారికి సహకరించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ప్రీత్ విహార్ పోలీసులు మొత్తం ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.