నంచర్ల రామాలయంలో సామూహిక వ్రతాలు.
సూర్య పెగడపెల్లి :మండలంలోని నంచర్ల గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో మంగళవారం కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా నంచర్ల గ్రామం తో పాటు చుట్టు గ్రామాల ప్రజలు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కథలో పాల్గొని తమ మొక్కులను తీర్చుకున్నారు. బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రిపెల్లి సత్యమ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గోలి జనార్దన్ రెడ్డి బిజెపి పెగడపల్లి,మల్యాల మండల అధ్యక్షులు పల్లె మోహన్ రెడ్డి గాజుల మల్లేశం దంపతులు బిజెపి ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు కూన కుమార్ నాయకులు కడారి జనార్ధన్, పాలోజీ శ్రీరామ్ చారి ఆలయ కోశాధికారి పోడేటి గంగాధర్ ఆలయ ప్రధాన అర్చకులు కూర్మాచలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.