కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు నిర్వహించిన మర్రి శశిధర్ రెడ్డి
సికింద్రాబాద్ కార్తీక పౌర్ణమి పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని, సనత్ నగర్ నియోజకవర్గం, అమీర్‌పేట్‌లోని శ్రీ హనుమాన్ దేవాలయంలో మాజీ మంత్రివర్యులు, ఎన్ డి ఎం ఏ మాజీ ఉపాధ్యక్షులు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఆలయంలో దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు నక్క శ్రీనివాస్ గౌడ్, దశరథ్, అనిల్ కుమార్, పి. నరేందర్, వి. సత్యనారాయణ, శివప్రసాద్, దయానంద్ రావు తదితరులు పాల్గొన్నారు