సమయస్ఫూర్తితో స్పందించిన మహిళా కానిస్టేబుళ్లను అభినందించిన జిల్లా ఎస్పీ
సూర్య ..ఎల్లారెడ్డిపేటలో మంగళవారం నిర్వహించిన వేణుగోపాల స్వామి రథోత్సవంలో స్వామివారిని దర్శించుకుంటూ కొబ్బరికాయ కొట్టే సమయంలో రాజమణి అనే భక్తురాలు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి కిందపడిపోయారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు స్వప్న, రోజా సమయస్ఫూర్తితో స్పందించి స్థానికుల సహకారంతో ఆమెకు తక్షణ ప్రథమ చికిత్స అందించారు. వారి సకాలంలో స్పందనతో కొద్దిసేపటికే రాజమణి తిరిగి మెలకువలోకి వచ్చారు.విధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు మానవతా దృక్పథంతో వ్యవహరించి భక్తురాలికి సకాలంలో సహాయం అందించిన మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు స్వప్న, రోజాలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రత్యేకంగా అభినందించారు.