బెజ్జుర్ కార్యదర్శి లేక జీపీ అభివృద్ధి పనులకు ఆటంకం
సూర్య – బెజ్జుర్: కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతోందని గ్రామస్తులు, సర్పంచ్ దుర్గం సరోజ,తిరుపతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జీపీ కార్యదర్శి అనారోగ్యంతో బాధపడుతుండటంతో పాటు పరీక్షలు ఉన్న కారణంగా గత 15 రోజులుగా విధులకు దూరంగా(,సెలవులలో )లీవ్ లో ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లింపులు నిలిచిపోతున్నాయని, కొత్తగా పనులు చేపట్టాలన్నా కార్యదర్శి అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.గ్రామ పంచాయతీకి సంబంధించిన పరిపాలనా వ్యవహారాలు, అభివృద్ధి పనులు ముందుకు సాగాలంటే కార్యదర్శి అందుబాటులో ఉండటం అవసరమని సర్పంచ్ అభిప్రాయపడ్డారు. సంబంధిత అధికారులు స్పందించి బెజ్జుర్ జీపీకి తక్షణమే కార్యదర్శిని నియమించాలని గ్రామస్తులు, సర్పంచ్ సరోజ కోరుతున్నారు.