BREAKING
సమస్యాత్మక గ్రామం నూతిమడుగులో ఎస్సై గోపి యాదవ్ పల్లెనిద్ర. కార్తీక పౌర్ణమి వేడుకలకు శివాలయంలో పోటెత్తిన భక్తులు- ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన -అర్చకులు శ్రీనివాస్ శర్మ పొన్నీటిపాళ్యం జనసేన సర్పంచ్ అభ్యర్థినిగా పి.నాగమణి నామినేషన్ : హాజరైన ఎంపీపీ గురునాథ్ యాదవ్,దారం అనిత చిర్యాల్ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో కార్తీక మాస సత్యనారాయణ వ్రతాలు ప్రారంభం కోటకాడపల్లి టిడిపి సర్పంచ్ అభ్యర్థిగా చౌడప్ప యాదవ్ నామినేషన్ : పెద్దసంఖ్యలో తరలివచ్చిన నాయకులు,కార్యకర్తలు కార్తీక పౌర్ణమి నాడు చంద్రమౌళీశ్వర దివ్యాలంకరణలో భవాని శంకర్ స్వామి మీ ఆదరణతో అఖండ విజయం అందించండి తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ ఫిబ్రవరి నెల దర్శన టికెట్లు, గదుల కోటా విడుదల భూమికోసం... కళ్ళకు గంతలు కట్టుకొని ఆందోళన భూమికోసం... కళ్ళకు గంతలు కట్టుకొని ఆందోళన కొత్తూరు పంచాయతీ, పాపం పల్లి గ్రామంలో వైయస్సార్సీపి ప్రచార ఊరు ప్రచార హోరు... విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిపిఓ మీ సేవకుడిగా పని చేస్తా ... ఆదరించండి కార్తీక పౌర్ణమి సందర్భంగా ముసి నదిలో పుణ్య స్నానాలు నంది పల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి

పొన్నీటిపాళ్యం జనసేన సర్పంచ్ అభ్యర్థినిగా పి.నాగమణి నామినేషన్ : హాజరైన ఎంపీపీ గురునాథ్ యాదవ్,దారం అనిత

Select Suryaa Now
పొన్నీటిపాళ్యం జనసేన సర్పంచ్ అభ్యర్థినిగా పి.నాగమణి నామినేషన్ : హాజరైన ఎంపీపీ గురునాథ్ యాదవ్,దారం అనిత

 

మదనపల్లి రూరల్,మేజర్ న్యూస్ : మదనపల్లి మండలం,పొన్నీటిపాళ్యం సర్పంచ్ స్థానానికి కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థినిగా పోలిశెట్టి నాగమణి నామినేషన్ దాఖలు చేశారు.ఈ నామినేషన్ కార్యక్రమానికి మదనపల్లి మండలం ఎంపీపీ బీదం గురునాథ్ యాదవ్,జనసేన పార్టీ రాయలసీమ కో-ఆర్డినేటర్ దారం అనితలు ముఖ్య అతిథులుగా హాజరుకాగా,కూటమి నాయకులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.ముందుగా నాగమణి అంకిశెట్టిపల్లి స్వర్ణ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా గురునాథ్ యాదవ్,దారం అనితలు మాట్లాడుతూ ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ప్రజల జీవితాలకు భరోసానిస్తున్నాయన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట్రం అన్నిరంగాలలో ముందంజ వేస్తోందని కొనియాడారు.ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా పంచాయతీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ప్రశంసించారు.గ్రామ పంచాయతీలు అభివృద్ధి పథంలో నడవాలంటే కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.పొన్నీటిపాళ్యం పంచాయతీ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి జనసేన నాయకులు పోలిశెట్టి వెంకటరమణ ముందుంటారని,ఆయన సతీమణి నాగమణి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారని ఆమెను ఆశీర్వదించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జగదీష్ రాయల్ నాయిని,జెసిబి ఈశ్వర్ నాయుడు,విష్ణు జంగాల ఆనంద్,జి.వి.నాయుడు,ఖాదర్,నయాజ్,సుబ్రమణ్యం,చిప్పిలి వెంకటేష్,కిరణ్,రాజా, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి