మీ ఆదరణతో అఖండ విజయం అందించండి
పామూరు, మేజర్ న్యూస్ : మండలంలోని వగ్గంపల్లి పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో తనకు ప్రజల ఆశీస్సులు ఆదరణ అందించాలని టీడీపీ బలపరిచిన అభ్యర్థి బైరెడ్డి మల్లేశ్వరి కోరారు. వగ్గంపల్లి గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 26న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో తనకు కేటాయించిన మంచం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తనకు ఒక్క అవకాశం కల్పించి ఘనవిజయం అందించాలని మల్లేశ్వరి కోరారు. ఈ కార్యక్రమంలో వగ్గంపల్లి గ్రామ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.