BREAKING
భూమికోసం... కళ్ళకు గంతలు కట్టుకొని ఆందోళన భూమికోసం... కళ్ళకు గంతలు కట్టుకొని ఆందోళన కొత్తూరు పంచాయతీ, పాపం పల్లి గ్రామంలో వైయస్సార్సీపి ప్రచార ఊరు ప్రచార హోరు... విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిపిఓ మీ సేవకుడిగా పని చేస్తా ... ఆదరించండి చిల్లేపల్లి ముసి నదిలో మహిళలు కార్తీక స్నానాలు - అంగరంగ వైభవంగా పూజలు దీపాల కాంతులతో మూసీ నది నంది పల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి ఇంటింటి ప్రచారం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఉత్కంఠ తొలగింది... వెల్దుర్తి మండలంలో మూడో విడత నామినేషన్ల హోరు నామినేషన్ల పర్వం సమాప్తం.. బరిలో 916 మంది! అంబాజీపేట మండలం కొర్లపాటివారిపాలెం వెంకన్న ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం: మాచవరం గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి మైపాల తాతాజీ జోరు నేటి పంచాంగం24 నవంబర్, 2026

మీ సేవకుడిగా పని చేస్తా ... ఆదరించండి

Select Suryaa Now
మీ సేవకుడిగా పని చేస్తా ... ఆదరించండి

మీ సేవకుడిగా పని చేస్తా.. ఆశీర్వదించండి 
- రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థి బండ అంజి యాదవ్ 
- అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ :  గత ఐదేళ్లు సర్పంచ్ గా రాచానుపల్లి గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేద ప్రజలకు అండగా నిలిచానని... ఆ సేవల స్ఫూర్తితోనే మరోసారి మీ ఆశీర్వాదంతో... సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని... మీ సేవకుడిగా పనిచేసేందుకు.. మరోసారి నాకు అవకాశం కల్పించాలని పంచాయతీ ప్రజలకు వైసిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బండ అంజి యాదవ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన పంచాయతీలో వివిధ కాలనీలలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ.. ఈనెల 26న జరిగే సర్పంచ్ ఎన్నికల్లో.. మంచం గుర్తుకు ఓటు వేసి.. నా అభ్యర్థత్వాన్ని బలపరిచి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాచానుపల్లి పంచాయతీలో గత ఐదేళ్లుగా... నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ... ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. నా వంతుగా అండగా నిలిచానని తెలిపారు. నేను చేసిన సేవలు, అభివృద్ధి గొప్పలు చెప్పుకోవడం లేదని... ఏం చేశానో.. కళ్ళు ఎదుటే..  కనిపిస్తుందని, ప్రజలందరూ కూడా చూశారని తెలిపారు. సొంత నిధులతో రోడ్లు, వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశానని, ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సాయం అందించానని తెలిపారు. పంచాయతీ అభివృద్ధి, ప్రజల క్షేమమే నా ధ్యేయం లక్ష్యమని, అందుకోసమే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని.. మరోసారి ఆశీర్వదించి.. గెలిపించి ప్రజా సేవ చేసేందుకు భాగ్యం కల్పించాలని ఆయన కోరారు.