తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం
తిరుమల, నవంబర్ 24: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండానే భక్తులు నేరుగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. నిన్న (నవంబర్ 23) 75,640 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 23,439 మంది తలనీలాలు సమర్పించారు. నిన్నటి హుండీ ఆదాయం రూ. 4.13 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. రద్దీ సాధారణం కంటే తక్కువగా ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన దర్శనం లభిస్తోంది.