డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా -ప్రమాణస్వీకారంలో 53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఆశయాలకు అనుగుణంగా మేయర్ జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని 53వ డివిజన్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ తెలిపారు. నవంబర్ ఒకటో తేదీ జరిగిన నగర పాలక సంస్థ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా 53వ డివిజన్ నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఈ మేరకు సోమవారం ఎస్వియూ శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ ఈ సందర్భంగా కార్పొరేటర్ శంకర్ యాదవ్ తనపై విశ్వాసం ఉంచి అత్యధిక మెజారిటీతో గెలిపించిన 53వ డివిజన్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, డివిజన్‌లో నెలకొన్న తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధిదీపాలు తదితర మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, తిరుపతిని అన్ని రంగాల్లో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని శంకర్ యాదవ్ స్పష్టం చేశారు. అనంతరం శంకర్ యాదవ్‌ను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, డివిజన్ ప్రజలు ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్