వెల్దుర్తి మండలంలో మూడో విడత నామినేషన్ల హోరు
సర్పంచ్ స్థానాలకు 35, వార్డు సభ్యులకు 171 నామినేషన్లు దాఖలు
బరిలో ఎంఎస్, ఎంబీఏ, బీఎస్సీ పట్టభద్రులు.. 86 ఏళ్ల వృద్ధుడు కూడా!
వెల్దుర్తి, మేజర్ న్యూస్: పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియలో భాగంగా సోమవారం (23-11-2026) వెల్దుర్తి మండలంలో అభ్యర్థులు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో సర్పంచ్ పదవులకు మొత్తం 35, వార్డు సభ్యుల స్థానాలకు 171 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో కార్యాలయ అధికారులు వెల్లడించారు.
పంచాయతీల వారీగా దాఖలైన నామినేషన్ల వివరాలు:
సర్పంచ్ స్థానాలు (35): అత్యధికంగా వెల్దుర్తి, బుక్కాపురం పంచాయతీలలో 6 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. కలుగొట్లలో 4, గోవర్ధనగిరి, రత్నపల్లిలలో 3 చొప్పున, భోగోలు, నర్సాపురం, ఎస్‌హెచ్.పెరెముల, రాయల్లకోట, మల్లెపల్లిలలో 2 చొప్పున, నార్లాపురం, కృష్ణాపురం, బొమ్మిరెడ్డిపల్లిలలో ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు వచ్చాయి.
వార్డు సభ్యుల స్థానాలు (171): వెల్దుర్తి పంచాయతీలో అత్యధికంగా 37 నామినేషన్లు దాఖలు కాగా, కలుగొట్ల (26), కృష్ణాపురం (26), బుక్కాపురం (15), భోగోలు (12), గోవర్ధనగిరి (11), రాయల్లకోట (10), రత్నపల్లి (8), సూదేపల్లె (6), నర్సాపురం (3), మాదార్‌పురం (3), ఎస్‌హెచ్.బోయనపల్లి (3), ఎస్‌హెచ్.పెరెముల (2), పుల్లగుమ్మి (2), శ్రీరంగాపురం (2), బింగిదొడ్డి (2), మల్లెపల్లి (2), లక్ష్మీనగరం (1) పంచాయతీలలో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు.
బరిలో ఉన్నత విద్యావంతులు, వృద్ధులు:
గ్రామీణ రాజకీయాలపై ఉన్నత విద్యావంతులు, యువతతో పాటు వృద్ధులు కూడా ఆసక్తి చూపారు.
వెల్దుర్తి సర్పంచి స్థానానికి ఎంఎస్ (టెలికమ్యూనికేషన్) చదివిన బొమ్మన్న రమాకాంత్‌రెడ్డి, బొమ్మిరెడ్డిపల్లి సర్పంచి స్థానానికి బీకాం, డీఈడీ చదివిన ఈగల శ్రీనివాసులు నామినేషన్లు వేశారు.
వార్డు సభ్యుల బరిలో వెల్దుర్తికి చెందిన ఎంబీఏ పట్టభద్రులు బి.వెంకటనర్సునాయుడు, రేణుక నాయకంటి, బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన రాజేష్ నాయకల్లు, బీఎస్సీ నర్సింగ్ చదివిన ఎన్.భాగ్యలక్ష్మి, శ్రీరంగాపురానికి చెందిన బీఈడీ అభ్యర్థి మేడబోయిన అయ్యన్న, ఎస్‌హెచ్.బోయనపల్లికి చెందిన వైద్యుడు (పీజీ) కేశవర్ధన్‌రెడ్డి నర్సింగ్ తదితరులు నామినేషన్లు దాఖలు చేశారు.
వయోభారం లెక్కచేయకుండా: వెల్దుర్తి 16వ వార్డుకు 86 ఏళ్ల మోషన్న నాయకంటి, నార్లాపురం సర్పంచి స్థానానికి 76 ఏళ్ల పెనికలపాటి లక్ష్మీదేవమ్మ, వెల్దుర్తి సర్పంచి స్థానానికి 79 ఏళ్ల బి.సుబ్బారెడ్డి నామినేషన్లు వేయడం విశేషం. అలాగే 21 ఏళ్ల యువత కూడా సర్పంచి, వార్డు బరిలో నిలిచారు