వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి ఇంటింటి ప్రచారం
వెల్దుర్తి, మేజర్ న్యూస్: వెల్దుర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మంగళవారం ఆమె తన కుమార్తె శ్వేత, కుమారుడు శ్రీనాథ్‌తో కలిసి గ్రామంలోని పలు వీధుల్లో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు 2వ వార్డు మెంబర్ షేక్ నసీమా, పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఓటర్లను కలిశారు.గ్రామ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు తమను ఆదరించి గెలిపించాలని పుష్పావతి ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము అధికారంలోకి వస్తే గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.