భూమికోసం... కళ్ళకు గంతలు కట్టుకొని ఆందోళన
మా భూమిని మాకు కాకుండా చేస్తున్నారు
పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్...
తమకున్న కొద్దిపాటి భూమిని కుట్రపూరితంగా కొందరు పెద్దలు కాజేయాలని తమకు అన్యాయం చేస్తున్నారని అందుకు గతంలో ఉన్న అధికారులు సహకారం అందించారని తమకు న్యాయం కావాలని కళ్ళకు గంతలు కట్టుకొని ఎంపీడీవో కార్యాలయం వద్ద చిల్లి ముంత సీతారాములు, చిల్లి ముంత గోపి, చిల్లి ముంత జమలయ్య కుటుంబాలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. గౌరారం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 451 లో పది ఎకరాల భూమి గంగయ్య సాగు చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులకు కారణంగా నాలుగు ఎకరాలు విక్రయించారని ఆరు ఎకరాలు ముగ్గురికి రెండు ఎకరాలు లెక్కన పంచి పెట్టారని వివరించారు. అట్టి 6ఎకరాల భూమిని అప్పటి రెవెన్యూ అధికారులు అప్పటి అధికారులు తమకు కాకుండా ఇతరులకు చేశారని వరకు అట్టి భూమికి పాస్ బుక్కులు ఇవ్వలేదని కొందరు మా భూమిని తమకు చెందకుండా న్యాయం చేస్తున్నారని అధికారులు తమకు న్యాయం చేయట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులో పేర్కొన్నారు. స్పందించిన తహసిల్దార్ వీరభద్ర నాయక్ వారి విన్నపాన్ని పరిశీలించి విచారణ చేపడతామని చెప్పడంతో ఆందోళన విరమించారు.