విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిపిఓ
విద్యార్థులకు రుచికరమైన పోషకాహారం అందించాలి
డిపిఓ వినోద్ కుమార్.
ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం ఆన్లైన్ ప్రక్రియ పరిశీలన
పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్....
జిల్లా పంచాయతీ అధికారి (డిపిఓ ) వినోద్ కుమార్ సోమవారం పెనుబల్లి మండలంలో పర్యటించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం ఈనెల 19 నుండి ప్రారంభమైంది. అందులో భాగంగా ఆయా పంచాయతీ కార్యాలయాల్లో నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెనుబల్లి పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న ఇందిరమ్మ కుటుంబ భీమా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఇంటర్నెట్ సమస్య తలెత్తుతుందా...ప్రజలకి సమాచారం అందించారా లేదా అని వివరాలకి తెలుసుకున్నారు. అలాగే పెనుబల్లి ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను తెలుసుకున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యతను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని చేసి భోజనం నాణ్యత అసంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలకు ఖచ్చితమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని పాఠశాల వద్ద వంటలు ఏర్పాటు చేయాలని డివివో ఆదేశించారు. పిల్లలకు అందించే భోజనంలో పోషక విలువలు ఆహార అందిస్తే మానసికంగా వృద్ధి చెందుతారని సూచించారు. పోషక ఆహారము దాని ప్రాముఖ్యతను పుస్తకాల్లో పాఠాలుగా బోదిస్తున్నామని క్షేత్ర స్థాయిలో అదేవిధంగా ఉండాలని అన్నారు. భోజనంలో కూరలు రుచిగా ఉంటేనే పిల్లలు ఇష్టంగా తింటారని సూచించి మెనూ ప్రకారం రుచికరమైన ఆహారం అందించాలని ఆదేశించారు. కొన్ని రేషన్ కార్డులలో ఒక్కొక్కరి పేరు మాత్రమే ఉందని దాంతో తమ పేర్లు నమోదు కావడం లేదని తెలుసుకొని ప్రభుత్వం దీనిపైన స్పందించి మార్గదర్శకాలు అందిస్తాయని ఏ ఒక్కరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిపిఓ వివరించారు ఇందిరమ్మ కుటుంబ భీమా ఆ కుటుంబానికి భరోసాని ఆయన అన్నారు ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం వహించకుండా నమోదు కార్యక్రమాన్ని చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బానోతు పాప, ఎంపీడీవో వీరాస్వామి, పంచాయతీ కార్యదర్శి సిబ్బంది పాల్గొన్నారు