BREAKING
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ ఫిబ్రవరి నెల దర్శన టికెట్లు, గదుల కోటా విడుదల భూమికోసం... కళ్ళకు గంతలు కట్టుకొని ఆందోళన భూమికోసం... కళ్ళకు గంతలు కట్టుకొని ఆందోళన కొత్తూరు పంచాయతీ, పాపం పల్లి గ్రామంలో వైయస్సార్సీపి ప్రచార ఊరు ప్రచార హోరు... విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిపిఓ మీ సేవకుడిగా పని చేస్తా ... ఆదరించండి కార్తీక పౌర్ణమి సందర్భంగా ముసి నదిలో పుణ్య స్నానాలు నంది పల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి ఇంటింటి ప్రచారం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఉత్కంఠ తొలగింది... వెల్దుర్తి మండలంలో మూడో విడత నామినేషన్ల హోరు నామినేషన్ల పర్వం సమాప్తం.. బరిలో 916 మంది! అంబాజీపేట మండలం కొర్లపాటివారిపాలెం వెంకన్న ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం: మాచవరం గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి మైపాల తాతాజీ జోరు

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ ఫిబ్రవరి నెల దర్శన టికెట్లు, గదుల కోటా విడుదల

Select Suryaa Now
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ ఫిబ్రవరి నెల దర్శన టికెట్లు, గదుల కోటా విడుదల

తిరుమల, నవంబర్ 24: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముఖ్య గమనిక జారీ చేసింది. 2027 ఫిబ్రవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, వసతి గదుల కోటాను ఇవాళ (నవంబర్ 24) ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్ఈడీ) టికెట్ల కోటాను అందుబాటులోకి తీసుకురానుండగా, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటాను విడుదల చేయనున్నారు. ఆసక్తి గల భక్తులు దళారులను ఆశ్రయించకుండా కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ (ttdevasthanams.ap.gov.in) ద్వారా మాత్రమే టికెట్లు, గదులను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.