BREAKING
కార్తీక పౌర్ణమి రథోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌కు రూ. 88,624.65 కోట్ల పెట్టుబడుల వెల్లువ: షాంఘై నాయకుల బీజింగ్‌కు విధేయత ప్రకటన: చైనా అంతరిక్ష కేంద్రంలోకి తొలి పాకిస్థాన్ వ్యోమగామి: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల తగ్గుదల: వెనిజులా మార్కెట్లోకి మళ్లీ అడుగుపెట్టేందుకు సిటీ గ్రూప్ కసరత్తు: ఆస్ట్రేలియా సైనిక వివక్షపై చారిత్రక క్షమాపణ: ఉక్రెయిన్ ఓడరేవు నగరం ఒడెసాపై రష్యా భీకర దాడి.. ఆస్ట్రేలియా డాలర్ బలోపేతం: ఆసియా స్టాక్ మార్కెట్లలో మళ్లీ భారీ పతనం: మద్దిమడుగు సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠకు తరలిరావాలి: వి.బి.జి. రాంజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, బొంరాస్‌పేట్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గండీడ్ నరసింహులు గౌడ్ ఏ2 మిల్క్ (a2 Milk) రూ. 250 కోట్ల పరిహార ఒప్పందానికి ఆమోదం: మాజీ సర్పంచ్ నర్సింలు మనవడి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమయస్ఫూర్తితో స్పందించిన మహిళా కానిస్టేబుళ్లను అభినందించిన జిల్లా ఎస్పీ 108లో ప్రసవం.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

చిర్యాల్ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో కార్తీక మాస సత్యనారాయణ వ్రతాలు ప్రారంభం

Select Suryaa Now
చిర్యాల్ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో కార్తీక మాస సత్యనారాయణ వ్రతాలు ప్రారంభం

కీసర,మేజర్ న్యూస్:కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిర్యాల్ గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనాల కోసం భక్తులు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చారు.తెల్లవారుజాము నుంచే ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం బ్యాచ్‌ల వారీగా సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహిస్తున్నారు.భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ, ధర్మకర్త శ్రీహరి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనాలు, వ్రతాల నిర్వహణ సజావుగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో చిర్యాల్ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయం ఒకటిగా పేరుగాంచింది. కార్తీక మాసం సందర్భంగా స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజలు, సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.