BREAKING
గ్రామపంచాయతీ ఎన్నికలపై వైఎస్ఆర్సిపి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలలో ఏజెంట్లు. తలారి రంగయ్య. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్. సమస్యాత్మక గ్రామం నూతిమడుగులో ఎస్సై గోపి యాదవ్ పల్లెనిద్ర. కార్తీక పౌర్ణమి వేడుకలకు శివాలయంలో పోటెత్తిన భక్తులు- ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన -అర్చకులు శ్రీనివాస్ శర్మ పొన్నీటిపాళ్యం జనసేన సర్పంచ్ అభ్యర్థినిగా పి.నాగమణి నామినేషన్ : హాజరైన ఎంపీపీ గురునాథ్ యాదవ్,దారం అనిత చిర్యాల్ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో కార్తీక మాస సత్యనారాయణ వ్రతాలు ప్రారంభం కోటకాడపల్లి టిడిపి సర్పంచ్ అభ్యర్థిగా చౌడప్ప యాదవ్ నామినేషన్ : పెద్దసంఖ్యలో తరలివచ్చిన నాయకులు,కార్యకర్తలు కార్తీక పౌర్ణమి నాడు చంద్రమౌళీశ్వర దివ్యాలంకరణలో భవాని శంకర్ స్వామి మీ ఆదరణతో అఖండ విజయం అందించండి తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ ఫిబ్రవరి నెల దర్శన టికెట్లు, గదుల కోటా విడుదల భూమికోసం... కళ్ళకు గంతలు కట్టుకొని ఆందోళన భూమికోసం... కళ్ళకు గంతలు కట్టుకొని ఆందోళన కొత్తూరు పంచాయతీ, పాపం పల్లి గ్రామంలో వైయస్సార్సీపి ప్రచార ఊరు ప్రచార హోరు... విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిపిఓ మీ సేవకుడిగా పని చేస్తా ... ఆదరించండి

గ్రామపంచాయతీ ఎన్నికలపై వైఎస్ఆర్సిపి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలలో ఏజెంట్లు. తలారి రంగయ్య.

Select Suryaa Now
గ్రామపంచాయతీ ఎన్నికలపై వైఎస్ఆర్సిపి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలలో ఏజెంట్లు. తలారి రంగయ్య.

**కళ్యాణదుర్గం:** పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అక్రమాలకు, అవకతవకలకు తావులేకుండా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఏజెంట్లు పాటించాల్సిన పలు కీలక సూచనలను ఆయన వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా కావాలని గొడవలు, అల్లర్లు సృష్టించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తే కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. అదే సమయంలో పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో చోటుచేసుకునే ప్రతి పరిణామాన్ని నిశితంగా గమనించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా వెంటనే పోలీసులకు, ఎన్నికల అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ముందుగానే పరిశీలించాలని, ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పోలింగ్ రోజున గ్రామాలకు సంబంధం లేని కొత్త వ్యక్తులు, స్థానికేతరులు అనుమానాస్పదంగా సంచరిస్తే వారి కదలికలపై దృష్టి సారించాలని, అనుమానం కలిగితే పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాను బూత్ ఏజెంట్లు క్షుణ్ణంగా పరిశీలించాలని, ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే ప్రతి ఓటరు వివరాలను ఎన్నికల నిబంధనల ప్రకారం ధ్రువీకరించాలని సూచించారు. ఎవరైనా నకిలీ ఓట్లు వేయడానికి ప్రయత్నించినట్లు గుర్తిస్తే నిబంధనల ప్రకారం వెంటనే అభ్యంతరం తెలియజేసి ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేయాలని తెలిపారు. రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్నారో లేదో గమనించాలని, ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తిస్తే సంబంధిత ఉన్నతాధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయాలని కోరారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఎవరైనా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నట్లు అనుమానం కలిగితే, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలకు వెళ్లకుండా సంబంధిత ఆధారాలను సేకరించి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు బూత్ ఏజెంట్లు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలను విడిచిపెట్టకుండా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని, ఎన్నికల ప్రక్రియలో ఎక్కడైనా చిన్నపాటి అవకతవకలు లేదా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా వెంటనే నియోజకవర్గ పార్టీ కార్యాలయానికి లేదా పార్టీ ముఖ్య నాయకులకు సమాచారం అందించాలని డాక్టర్ తలారి రంగయ్య కోరారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఎన్నికల నిబంధనలను గౌరవిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.