జాతీయస్థాయి కుంగ్ ఫూ కరాటే పోటీల్లో శ్రీ సత్య విద్యానికేతన్ విద్యార్థుల ప్రతిభ.
ఆలమూరు మేజర్ న్యూస్ ; రాజమండ్రి శ్రీకృష్ణ శ్రీసాయి కళ్యాణ మండపంలో జరిగిన ఓపెన్ సెకండ్ జాతీయస్థాయి కుంగ్ ఫూ కరాటే పోటీలో చెముడులంక శ్రీ సత్యా విద్యానికేతన్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించినట్లు స్కూల్ కోచ్ కే సత్తిబాబు తెలిపారు. సబ్ జూనియర్ కేటగిరిలో జి. సింధు, పి షీలా, జి దీపిక.లో, పి. సాత్విక, పి సుధా, కే. హాసినీ, పి. రుషి, ఎం సురేష్ లు ప్రధమ, ద్వితీయ స్థానాలు సాధించగా జూనియర్ విభాగంలో జి. రోసెలిన్ ఎస్ గౌతమ్, ఎన్. లోహిత్ ప్రథమ స్థానం సాధించి సెకండ్ ఓరల్ ఛాంపియన్షిప్ సాధించారు.
శ్రీ సత్యా విద్యాని కేతన్ స్కూల్ యజమాన్యం డైరెక్టర్ జి. విజయ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు వూషూ కుంగ్ ఫూ శిక్షణ అనేది చాలా అవసరమని శ్రీ సత్య విద్యానికేతన్ లో గత రెండు సంవత్సరాలుగా పిల్లలకు కరాటే, యుద్ధ విద్యలో మంచి తర్ఫీదు ఇస్తున్నట్లు తెలిపారు. కరాటే విద్య పట్ల మక్కువ, పట్టు సాధించడంతో జాతీయస్థాయి కరాటే పోటీల్లో పతకాలు సాధించినట్లు తెలిపారు. గెలుపొందిన విద్యార్థులను ప్రిన్సిపాల్ ప్రమోద్, ముఖ్య సలహదారులు పుత్ర కుమార్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.