BREAKING
ఉత్తరాఖండ్‌లో 4.9 తీవ్రతతో భూకంపం: ఆయిల్ & గ్యాస్ క్యూ2 ప్రివ్యూ: అప్‌స్ట్రీమ్ కంపెనీల జోరుతో ఎబిట్టా జంప్.. టాప్ పిక్‌గా ఆయిల్ ఇండియా: డోలాట్ క్యాపిటల్ నివేదిక! క్యూ2 ఫలితాల వేళ సిమెంట్ షేర్లపై దృష్టి: మార్జిన్ల ఒత్తిడి ఉన్నా దీర్ఘకాలిక ఔట్‌లుక్ సానుకూలం.. యాక్సిస్ సెక్యూరిటీస్ నివేదిక! ఎఫ్‌ఎమ్‌సీజీ క్యూ2 ప్రివ్యూ: ఆదాయాల్లో మెరుగైన వృద్ధి.. మార్జిన్లపై ముడిసరుకుల ఒత్తిడి: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నివేదిక! తప్పుడు లేబుళ్లు, పురుగుమందుల అవశేషాలతో భారత వ్యవసాయ ఎగుమతులకు బ్రేక్: యునిడో నివేదికలో విస్తుపోయే వాస్తవాలు! ఇరాన్ యుద్ధ నష్టాలు, మౌలిక వ్యయాలను ప్రపంచం పంచుకోవాల్సిందే: మధ్యప్రాచ్య చమురు దిగ్గజాల హెచ్చరిక! ఎన్ఎస్ఈ అన్‌లిస్టెడ్ షేర్లలో భారీ పతనం ప్లేగ్ వ్యాప్తి ముప్పు చాలా స్వల్పం: ప్రపంచవ్యాప్త ఆందోళనల వేళ డబ్ల్యూహెచ్‌వో స్పష్టత.. పటిష్ట నివారణ చర్యలు! ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ : పాలనా రంగంలో ఆయనను ప్రత్యేకంగా నిలిపిన అంశాలివే! కెప్టెన్ మచ్ఛర్ ప్రాణాలు కాపాడిన 45 నిమిషాల అత్యవసర చికిత్స: విమానంలో ఉత్కంఠ క్షణాలను పంచుకున్న డెంటిస్ట్! ఘనా అధ్యక్షుడితో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ: ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై విస్తృత చర్చలు! గత నెలలో రూ. 1,345 కోట్ల విలువైన పనులు పూర్తి.. వేగం మరింత పెంచాలని ఆదేశం! సీఎం చంద్రబాబు కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం: పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ ప్రత్యేక భేటీ! రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష: 21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం:

సేవా కార్యక్రమాలతో దబ్బని వెంకట్ జన్మదిన వేడుకలు

Select Suryaa Now
సేవా కార్యక్రమాలతో దబ్బని వెంకట్ జన్మదిన వేడుకలు

జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం.. 78 మంది యువకుల రక్తదానం
వెంకట్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆనంద్

మోమిన్‌పేట్,మేజర్ న్యూస్ (అక్టోబర్ 5):బీఆర్‌ఎస్ మోమిన్‌పేట్ మండల మాజీ అధ్యక్షుడు దబ్బని వెంకట్ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో సోమవారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీ బాలాజీ బ్లడ్ సెంటర్, మేఘ బ్లడ్ డొనేషన్ క్యాంప్ సంగారెడ్డి వైద్య బృందం సహకారంతో ఉదయం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 78 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. రక్తదానం చేసిన వారికి నిర్వాహకులు ప్రశంసా పత్రాలను అందజేశారు.అనంతరం మండల పరిధిలోని బీకేఆర్ ఫంక్షన్ హాల్‌లో దబ్బని వెంకట్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నాయకులు, కార్యకర్తలు దబ్బని వెంకట్‌ను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి ఈ రక్తదానం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఎన్. నరసింహారెడ్డి, సర్పంచులు బండ విష్ణువర్ధన్ రెడ్డి, పటేల్‌గారి శ్రీకాంత్ గౌడ్, అరుణ, బిచ్చయ్య, కిష్టయ్య చౌహాన్, లక్ష్మీరాజు తదితరులతో పాటు జిల్లా, మండల నాయకులు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రిపోర్టర్ వడ్ల మాణిక్యం చారి.