BREAKING
నేపాల్ వరదల పునర్నిర్మాణానికి రూ.24 వేల కోట్ల నేపాలీ రూపాయల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలకు ప్రజల మద్దతు: టీడీపీ ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి పొన్నూరులో ఫెర్టిలైజర్ డీలర్లకు ఎఫ్ ఎఫ్ ఎస్ పై శిక్షణ కార్యక్రమం........ మాట్లాడుతున్న ఏ డి ఏ వి రామకోటేశ్వరి దారుల్ ఖైర్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణి నసురుల్లాబాద్ ను కరువు మండలం గా ప్రకటించాలి. జలాల్పూర్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం అంతంపల్లిలో ఇందిరమ్మ కుటుంబ బీమా ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభం సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు .డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ని కలిసి వినతి పత్రం సమర్పించిన డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలుగా ఆకుల కల్పన చంద్రశేఖర్ కార్తీక దీపకాంతులతో వెలిగిన నవనాథ సిద్ధులగుట్ట - తెల్లవారుజాము నుంచే  పోటెత్తిన భక్తులు ణేష్ ఘాట్‌లో మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన విరాళాల సేకరణ దాతను సన్మానించిన హిందూ జాగృతి సభ్యులు ఏఐతో వీఎల్‌ఎస్‌ఐ, సీఎంఓఎస్‌ డిజైన్‌లో కొత్త ఆవిష్కరణలు ఎలినో కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – ఆర్మూర్ సబ్‌ కలెక్టర్‌కు ఏఐయూకేఎస్‌ నాయకుల వినతి

కార్తీక దీపకాంతులతో వెలిగిన నవనాథ సిద్ధులగుట్ట - తెల్లవారుజాము నుంచే  పోటెత్తిన భక్తులు

Select Suryaa Now
కార్తీక దీపకాంతులతో వెలిగిన నవనాథ సిద్ధులగుట్ట - తెల్లవారుజాము నుంచే  పోటెత్తిన భక్తులు
సూర్య, ఆర్మూర్‌ : కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా ఆర్మూర్‌ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్ధులగుట్ట భక్తజన సందోహంతో కిటకిటలాడింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే నిజామాబాద్‌ జిల్లాతో పాటు వివిధ జిల్లాలు, గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలోని సిద్ధేశ్వర స్వామికి పంచామృతాలు, బిల్వపత్రాలతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉసిరికాయలపై నెయ్యి వత్తులతో కార్తీక దీపాలను వెలిగించి భక్తిశ్రద్ధలతో దీపారాధనలు చేశారు. మహిళలు ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటూ కార్తీక మాస ఆచారాలను పాటించారు.నవనాథ సిద్ధులు ఈ గుట్టపై తపస్సు చేసినట్లు స్థలపురాణం చెబుతోంది. అందుకే ఈ క్షేత్రానికి నవనాథ సిద్ధులగుట్టగా ప్రసిద్ధి వచ్చింది. సహజసిద్ధమైన నల్లరాతి శిలలు, గుహల్లో కొలువైన శివలింగం ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గుహలోని శివలింగంతో పాటు రామాలయం, దుర్గామాత, హనుమాన్‌, దత్తాత్రేయ తదితర ఆలయాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నాయి. ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మిక వైభవం కలగలిసిన ఈ క్షేత్రం ఆర్మూర్‌ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది.శ్రీ నందీశ్వర మహారాజ్‌ ఆధ్వర్యంలో రామాలయం నుంచి జీవకోనేరు వరకు ఉత్సవ విగ్రహాల పల్లకీసేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భజనలు, భక్తిగీతాలు, శివనామస్మరణల మధ్య సాగిన పల్లకీసేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ జిమ్మి రవి,చరణ్‌రెడ్డి, హజారి సతీష్‌, కొంతం మంజుల, మురళి, సందేశ్‌, శ్రీనివాస్‌, బి.సుమన్‌, కోడిగెల మల్లయ్య, పి.సి.గంగారెడ్డి, బట్టు శంకర్‌, రామాగౌడ్‌, చక్రవర్తి,బొండ్ల ఆనంద్, సిద్ధలగుట్ట సేవాసమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.