telangana
దారుల్ ఖైర్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణి
సూర్య చొప్పదండి : మానత్వానికి మించిన మతంలేదని మాధవ సేవగా మానవసేవ చేయటంలోనే అన్ని మతాల ధర్మం ఉందని మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లురి సరిత శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ సరిత శ్రీనివాస్ వైస్ చైర్మన్ పెరుమండ్ల మానస గంగాయ్య గౌడ్, స్థానిక జామ మసిద్ లో దారుల్ ఖైర్ వేల్పేర్ సోసైటి ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా నిరుపెదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. దారుల్ ఖైర్ వేల్పేర్ సోసైటి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ డా ఖుద్ధుస్ మాట్లాడుతు కుల మతాలకు అతీతంగా ప్రజలందరు ముందుకు సాగి దేశ అభివృద్ధి లో బాగ్యస్వాములు అవ్వాలని అన్నారు. దారులు వేరైన గమ్యం ఓక్కటేనని అన్ని మతాల సారం అదేనని అన్నారు. మనకు ఉన్నదాంట్లో నిరుపెదలకు దానం చేస్తు భగవంతుని కృపపోందాలని అన్నారు. దారుల్ ఖైర్ సోసైటి సభ్యులు ప్రతి వేసవికాలంలో వరసంతలో వచ్చే ప్రజల దాహర్తిచటానికి మినరల్ వాటర్ చలివేంద్రం ఏర్పాటు చేస్తు ఇలాంటి మానవీయ కార్యక్రమాలను ఎన్నో చేయటం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరేన్నో చేయాలని తమ వంతు సహాకారం అందిస్తామన్నారు. ఈకార్యక్రమంలో జామా మస్జీద్ కమిటీ అధ్యక్షుడు ఆబిద్ ఆలీ, దారుల్ ఖైర్ సొసైటీ చైర్మన్ డా ఖుద్ధుస్, ట్రస్ట్ సభ్యులు నజీబ్, జమాల్, షకీల్, నయీమ్, ఖాజా అలీ, జహీరొద్దీన్, యూసుఫ్ అలీ, అసిఫ్ అలీ, మాసూద్, చొప్పదండి మండల పురోహిత అధ్యక్షులు శ్రీమాన్ సింహాచలం ప్రభాకర చార్యులు తదితరులు పాల్గొన్నారు.