BREAKING
లిబియా తీరంలో రష్యా యుద్ధనౌక మునిగిపోవడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ప్రకటన డిసెంబరు 22న ఎస్.ఐ.ఆర్ తుది జాబితా ప్రకటన: జిల్లా కలెక్టర్ నేపాల్‌కు రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం అర్హులందరికీ బీమా రక్షణ కల్పించడమే లక్ష్యం - ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు పింఛన్ల మంజూరీలో అనర్హులను తొలగించాలి వెల్లూరు సీఎంసీలో దేశంలోనే తొలి హ్యూమన్ మెటబాలిక్ ఛాంబర్ ప్రారంభం జాతీయస్థాయి కరాటే పోటీల్లో విజయభేరి మోగించిన స్లేట్ హైస్కూల్ విద్యార్థులు నేపాల్ పర్యటనకు ప్రధాని మోదీకి ఆహ్వానం వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరే ప్రధాన లక్ష్యం: సీఎండీ పి. పుల్లారెడ్డి పండుగ సీజన్‌లో దూసుకెళ్లిన ఈవీ విక్రయాలు వృత్తి నైపుణ్య శిక్షణకు అర్హులైన ఫ్యాకల్టీ ఎంపిక శ్రీ రామలింగేశ్వర స్వామికి వెండి విరాళం.. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎల్లూరు సర్పంచ్ చప్పిడి రవీందర్ నగరం మండలంలో 42,477 మంది ఓటర్లు ప్రమాద బీమాతో బాధిత కుటుంబానికి అండగా గాయత్రి బ్యాంకు

ప్రమాద బీమాతో బాధిత కుటుంబానికి అండగా గాయత్రి బ్యాంకు

Select Suryaa Now
ప్రమాద బీమాతో బాధిత కుటుంబానికి అండగా గాయత్రి బ్యాంకు
సూర్య, మంచిర్యాల : బ్యాంకింగ్ సేవలతో పాటు ఖాతాదారుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంలో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ప్రత్యేక చొరవ చూపుతోంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఖాతాదారుడి కుటుంబానికి ప్రమాద బీమా ద్వారా ఆర్థిక సహాయం అందించింది. మంచిర్యాల శాఖలో గాయత్రి నిర్భయ సేవింగ్స్ ఖాతా కలిగిన తోగిటి శివ ప్రమాదవశాత్తు మృతి చెందడంతో, ఆయన ఖాతాకు అనుసంధానమైన ప్రమాద బీమా పథకం కింద రూ.2 లక్షల చెక్కును సోమవారం మృతుడి తల్లి తోగిటి నాగకు మంచిర్యాల తహసీల్దార్ రఫతుల్లా హుస్సేన్ చేతుల మీదుగా ఈ చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు ప్రతినిధులు మాట్లాడుతూ ఖాతాదారులకు పొదుపు సేవలతో పాటు ప్రమాద బీమా వంటి సౌకర్యాలు అందించడం ద్వారా కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. మంచిర్యాల పరిసర గ్రామాల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించి, పెన్షనర్లు, ఇతర ఖాతాదారులకు గ్రామాల్లోనే బ్యాంకు లావాదేవీలు నిర్వహించుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. బ్రాంచి మేనేజర్ కేలేటి ప్రవీణ్ మాట్లాడుతూ వినియోగదారుల నగదు అవసరాలను తీర్చేందుకు 24 గంటల పాటు ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. రైతులకు 10.50 శాతం వార్షిక వడ్డీతో వ్యవసాయ రుణాలు, బంగారు ఆభరణాలపై గ్రాముకు గరిష్టంగా రూ.9 వేల వరకు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. వ్యాపారుల అభివృద్ధికి రుణ సదుపాయాలు కల్పిస్తున్నామని, కిసాన్ వికాస్ పత్రాలు, పోస్టాఫీసు డిపాజిట్లపై 10 శాతం వార్షిక వడ్డీ రేటుతో రుణాలు అందిస్తున్నామని వెల్లడించారు. పొదుపు ఖాతాల ప్రారంభానికి అవసరమైన ఫొటోలు, జిరాక్స్ ప్రతులను బ్యాంకులో ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు అందిస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి.సుధాకర్, సీనియర్ ఆఫీసర్ ఆర్.రమేష్, జూనియర్ ఆఫీసర్లు ఇ.శివకుమార్, ఎస్.సాగర్ పాల్గొన్నారు.