BREAKING
లిబియా తీరంలో రష్యా యుద్ధనౌక మునిగిపోవడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ప్రకటన డిసెంబరు 22న ఎస్.ఐ.ఆర్ తుది జాబితా ప్రకటన: జిల్లా కలెక్టర్ నేపాల్‌కు రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం అర్హులందరికీ బీమా రక్షణ కల్పించడమే లక్ష్యం - ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు పింఛన్ల మంజూరీలో అనర్హులను తొలగించాలి వెల్లూరు సీఎంసీలో దేశంలోనే తొలి హ్యూమన్ మెటబాలిక్ ఛాంబర్ ప్రారంభం జాతీయస్థాయి కరాటే పోటీల్లో విజయభేరి మోగించిన స్లేట్ హైస్కూల్ విద్యార్థులు నేపాల్ పర్యటనకు ప్రధాని మోదీకి ఆహ్వానం వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరే ప్రధాన లక్ష్యం: సీఎండీ పి. పుల్లారెడ్డి పండుగ సీజన్‌లో దూసుకెళ్లిన ఈవీ విక్రయాలు వృత్తి నైపుణ్య శిక్షణకు అర్హులైన ఫ్యాకల్టీ ఎంపిక శ్రీ రామలింగేశ్వర స్వామికి వెండి విరాళం.. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎల్లూరు సర్పంచ్ చప్పిడి రవీందర్ నగరం మండలంలో 42,477 మంది ఓటర్లు ప్రమాద బీమాతో బాధిత కుటుంబానికి అండగా గాయత్రి బ్యాంకు

వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరే ప్రధాన లక్ష్యం: సీఎండీ పి. పుల్లారెడ్డి

Select Suryaa Now
వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరే ప్రధాన లక్ష్యం: సీఎండీ పి. పుల్లారెడ్డి

గుంటూరు : ​గుంటూరు, సీఆర్డీఏ విభాగాల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) అధ్యక్షులు మరియు నిర్వహణ సంచాలకులు (సీఎండీ) పి. పుల్లారెడ్డి సమగ్ర సమీక్ష నిర్వహించారు. విజయవాడ లోని ప్రధాన కార్యాలయం నుండి దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా ఈ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో విద్యుత్ సరఫరా నాణ్యత, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, ఆదాయ వసూళ్లు, సరఫరా నష్టాల తగ్గింపు, విద్యుత్ భద్రత, నిర్వహణ పనులు, ఉపకేంద్రాలు (సబ్‌స్టేషన్లు),  పంపిణీ వ్యవస్థ పనితీరు వంటి అంశాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా పి. పుల్లారెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. వినియోగదారుల నుండి ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్య ఘర్ - ఉచిత విద్యుత్ పథకం, ప్రధానమంత్రి కుసుమ్, పునర్వ్యవస్థీకరించిన పంపిణీ రంగ పథకం (ఆర్డీఎస్ఎస్), నూతన ఉపకేంద్రాల నిర్మాణ పురోగతి తదితర పథకాలను సమీక్షించి, నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వినియోగదారులు కొత్త విద్యుత్ కనెక్షన్ల కోసం ఇకపై మీ-సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. సంస్థ అధికారిక అంతర్జాల వేదిక (వెబ్‌సైట్) లేదా చరవాణి అనువర్తనం (మొబైల్ యాప్) ద్వారా ఇంటి నుంచే సులభంగా కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఆన్‌లైన్ సేవలను వినియోగించుకుని సమయం, శ్రమను ఆదా చేసుకోవాలని ప్రజలకు సూచించారు.ఆదాయ వసూళ్లలో మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వినియోగదారులకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక విభాగ సంచాలకులు ఎస్. వెంకటేశ్వర్లు, సాంకేతిక విభాగ సంచాలకులు ఆవుల మురళీకృష్ణయాదవ్, ప్రాజెక్టుల విభాగ సంచాలకులు టీవీఎస్ఎన్ మూర్తి, గుంటూరు విభాగ పర్యవేక్షక ఇంజనీర్ రమేష్, సీఆర్డీఏ విభాగ పర్యవేక్షక ఇంజనీర్ సుధాకర్, సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

సూర్య నాయక్