స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలకు ప్రజల మద్దతు: టీడీపీ ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి
*మంత్రాలయం రూరల్ సూర్య ప్రతినిధి,* స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి పనిచేస్తాయని మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. మాధవరం టీడీపీ కార్యాలయంలో జనసేన ఇన్‌చార్జ్ లక్ష్మన్న, బీజేపీ ఇన్‌చార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. బీసీలకు పార్టీ పరంగా 40 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లోనూ మూడు పార్టీలు సమన్వయంతో పనిచేస్తాయని వెల్లడించారు.
*నాగరాజు, మంత్రాలయం రూరల్, సూర్య ప్రతినిధి,కర్నూలు జిల్లా*