telangana
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి - అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే
సూర్య కరీంనగర్ : ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి.. సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకునేందుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే.. వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీలో ప్రజావాణి నిర్వహించగా.. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, కరీంనగర్ ఆర్డీవో షర్మిల, తదితర శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 183 దరఖాస్తులు రాగా.. అత్యధికంగా కరీంనగర్ నగరపాలికకు 54, గృహ నిర్మాణ శాఖకు 47 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.తమ లాగిన్ కు వచ్చిన దరఖాస్తులను నెల రోజుల్లోపే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.