నిరుపేదలకు భరోసా ఇందిరమ్మ కుటుంబ బీమా - టీపీసీసీ ప్రధాన కార్యదర్శి
సూర్య- బిక్కనూర్ : నిరుపేదలకు భరోసా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అని, టి పి సి సి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. సోమవారం మండలంలోని కాచాపూర్ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం మరియు చేయూత ఆసరా పెన్షన్ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నాగన్నగారి నరేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ జ్యోతి సంతోష్ గౌడ్, ఉప సర్పంచ్ తొగరి దశరథం, మాజీ ఎంపీపీలు బైండ్ల సుదర్శన్, గాల్ రెడ్డి పార్టీ నాయకులు లబ్ధిదారులు ఉన్నారు