telangana
పింఛన్ల మంజూరీలో అనర్హులను తొలగించాలి
సూర్య, జన్నారం : జన్నారం మండలం ఇంధన్ పల్లి పంచాయతీ పరిధిలో అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు కాక అనర్హులకు మంజూరు చేశారని, ఇదేమిటని అడిగితే పొంతనలేని సమాధానం చెప్పి కార్యదర్శిలు దాటవేస్తున్నారని, వీటిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీడీవో ఉమర్ షరీఫ్ కు ఉప సర్పంచ్ చుంచు వినయ్ కుమార్, గ్రామస్తులు కలిసి ఎంపీడీవో ఉమర్ షరీఫ్ కు వినతి పత్రం అందజేశారు. అర్హులను పక్కనపెట్టి అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారంటూ పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామ కారొబారిగా విధులు నిర్వహిస్తున్న అడ్డగురి సత్యనారాయణకు సైతం పింఛన్ మంజూరు కావడం ఏమిటని వినయ్ కుమార్ ప్రశ్నించారు. అనర్హతలు, నిబంధనలు పరిశీలించకుండా పంచాయతీ కార్యదర్శి పింఛన్లు ఎలా మంజూరు చేశారని ప్రశ్నించారు. విచారణ నిర్వహించిన ఎంఈఓ రాజేందర్ ను సంప్రదిస్తే పంచాయతీ కార్యదర్శి చెప్పినట్టుగానే తాను చేశానని సమాధానం ఇస్తున్నారని వినయ్ కుమార్ ఆరోపించారు. ఈ విషయంలో ఎంపీడీవో ఉమర్ షరీఫ్ ను సంప్రదించగా అన్ని కోనాల నుంచి విచారణ జరిపి అనర్హులను తొలగించడం జరుగుతుందని, ఎవరూ బాధపడవలసిన అవసరం లేదని అన్నారు.