BREAKING
బ్రిటిష్ పౌండ్ స్వల్ప పునరాగమనం నివేదా థామస్ శ్రీమతి ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 4న ఓటీటీలోకి వచ్చేస్తోంది శ్రీ సత్యసాయి తాగునీటి పంప్‌హౌస్ వద్ద ఘనంగా 101వ శ్రీ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు భక్తిపారవశ్యంలో అన్నదాన నారాయణ సేవ.. సేవా కార్యక్రమాలతో మార్మోగిన సాయినామ స్మరణ ఇటలీ ఎగ్జిట్ ట్యాక్స్ నిబంధనల సడలింపు అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల తర్వాత ఎన్టీఆర్ సినిమా.. సినీ వర్గాల్లో జోరుగా చర్చ కోకాకోలా బాట్లింగ్ సంస్థ సీసీఈపీపై ఈయూ యాంటీట్రస్ట్ దర్యాప్తు ఇంకొల్లు మండంలో 191 మంది పోటీ బంగ్లాదేశ్ గార్మెంట్ కార్మికులకు 15 శాతం వేతన పెంపు ప్రతిపాదన జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలి : డిసెంబర్ 1న టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా మహాసభ : ప్రపంచ మార్కెట్లలో కృత్రిమ మేధస్సు ఆందోళనలు తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి - బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి సలేశ్వరం ముదిరాజ్ తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి - బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి సలేశ్వరం ముదిరాజ్ డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్ ప్రారంభం.. ‘పాకెట్ రాకెట్స్’ ఆల్బమ్‌తో నిహారిక కొత్త ప్రయాణం 2033 వరకు ఆర్మ్ హోల్డింగ్స్ సీఈఓగా రెనే హాస్

జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం

Select Suryaa Now
జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి. :
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) నిర్మల్ జిల్లా మహాసభలను డిసెంబర్ 1న నిర్వహించనున్న నేపథ్యంలో, మహాసభలకు హాజరు కావాలని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తిని యూనియన్ జిల్లా నాయకులు ఆహ్వానించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంక గారి భూమయ్య మహాసభల ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని వివరించారు.జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సంక్షేమం, వృత్తిపరమైన భద్రతతో పాటు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశాన్ని ప్రస్తావించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సాధన కోసం మున్సిపల్ పాలకవర్గం తరఫున సహకారం అందించాలని వైస్ చైర్మన్‌ను కోరారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంక గారి భూమయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్ముల అశోక్, కార్యదర్శి మనోజ్ తదితరులు పాల్గొన్నారు.